క్రిష్ ఖాళీగా ఏం లేడు వీరమల్లు..!

పవన్ కళ్యాణ్‌, క్రిష్ కాంబోలో మొదలు అయిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.

Update: 2024-01-04 16:30 GMT

పవన్ కళ్యాణ్‌, క్రిష్ కాంబోలో మొదలు అయిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

హరి హర వీరమల్లు సినిమా ను కమిట్ అవ్వడం వల్ల ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయిన క్రిష్‌ సమయం చాలా వృదా అవుతుంది అంటూ ఆయన అభిమానులు మరియు మీడియా సర్కిల్స్ వారు కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.

పవన్‌ డేట్లు ఇవ్వనంత మాత్రాన క్రిష్ ఖాళీగా ఏమీ లేడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆయన వరుసగా వెబ్‌ సిరీస్‌ లను నిర్మిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం చేయకున్నా కూడా దర్శకత్వ పర్యవేక్షన చేస్తూ వెబ్‌ సిరీస్‌ లను రూపొందిస్తున్నాడు.

అంతే కాకుండా ఇతర దర్శకుల సినిమాలకు సంబంధిచిన స్క్రిప్ట్‌ వర్క్‌ లో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇక క్రిష్‌ హరి హర వీరమల్లు సినిమాకు ముందు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా కొత్త స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు.

మొత్తానికి పవన్‌ డేట్లు ఇవ్వనంత మాత్రాన ఎప్పుడెప్పుడు ఆయన డేట్లు ఇస్తాడా అంటూ ఎదురు చూడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రిష్‌ కి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది.

Tags:    

Similar News