క్రిష్ కన్యాశుల్కం ఎక్కడవరకు వచ్చింది..?
అయితే వీరమల్లు మొదలు పెట్టడానికి ముందే క్రిష్ కన్యాశుల్కం అనే వెబ్ సీరీస్ ఒకటి ప్లాన్ చేశారు.
డైరెక్టర్ గా టాలెంట్ ఉన్నా కూడా కెరీర్ లో చాలా వెనకపడ్డారు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు ముందు ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణతో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేశారు. ఐతే ఆ సినిమాలు ఆడియన్స్ నుంచి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత పవన్ తో వీరమల్లు సినిమా భారీ రేంజ్ లో మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోయారు. పవన్ డేట్స్ ఇస్తే మిగిలిన ఆ పార్ట్ పూర్తి చేసి వీరమల్లుని రిలీజ్ చేయాలని చూస్తున్నారు క్రిష్.
అయితే వీరమల్లు మొదలు పెట్టడానికి ముందే క్రిష్ కన్యాశుల్కం అనే వెబ్ సీరీస్ ఒకటి ప్లాన్ చేశారు. యాంకర్ అనసూయ లీడ్ రోల్ లో ఈ వెబ్ సీరీస్ భారీ స్థాయిలో తెరకెక్కించాలని అనుకున్నారు. జీ 5 ఓటీటీ కోసం కన్యాశుల్కం సీరీస్ చేస్తున్నారని హడావిడి చేశారు. కానీ క్రిష్ ఆ వెబ్ సీరీస్ ని కూడా మరీ లేట్ చేస్తూ వచ్చాడు. ఈ వెబ్ సీరీస్ కోసమే అనసూయ జబర్దస్త్ వదిలేసిందని వార్తలు వచ్చాయి.
గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం రూపంలో ఎన్నో వందల వేల సార్లు రంగస్థలం మీద ప్రదర్శించారు. అయితే క్రిష్ ఈ కథను వెబ్ సీరీస్ గా చెప్పాలని అనుకున్నారు. క్రిష్ ఈ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించడానికి సిద్ధపడ్డారు. ఈ వెబ్ సీరీస్ లో అనసూయ మధురవాణి పాత్రలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ కోట్ చేసింది. సాయి కుమార్ కూడా ఈ సీరీస్ లో రామప్ప పంతులు పాత్ర చేస్తున్నారని అన్నారు.
ఓ పక్క వీరమల్లు మరోపక్క కన్యాశుల్కం ఈ రెండు ప్రాజెక్టుల మీద క్రిష్ దృష్టి పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ వెబ్ సీరీస్ ఎంతవరకు వచ్చిందో తెలియలేదు. కనీసం ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కూడా బయటకు రాలేదు. అనసూయ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని ఆపేశారా లేదా వీరమల్లు తర్వాత పూర్తి దృష్టి దాని మీదే పెట్టాలని అనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా క్రిష్ కన్యాశుల్కం సీరీస్ ప్రకటించగానే ఆయన డైరెక్షన్ లో ఈ సీరీస్ అదిరిపోతుందని అనుకున్న అభిమానులకు ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం కొంత అసంతృప్తి పరచింది.