అమ్మడి కష్టాన్ని దర్శకులు గుర్తించాలి..!
సక్సస్ కొడుతున్న హీరోయిన్స్ కు వరుస ఆఫర్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఆ హిట్ జోష్ ఆటోమేటిక్ గా అవకాశాలను తెచ్చిపెడతాయి
సక్సస్ కొడుతున్న హీరోయిన్స్ కు వరుస ఆఫర్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఆ హిట్ జోష్ ఆటోమేటిక్ గా అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ ఒక్కసారి ఫ్లాప్ ఫేస్ చేస్తే మాత్రం దాన్ని దాటి ఆఫర్లు రావాలంటే మాత్రం చాలా కష్టం. హిట్లు కొడుతున్నప్పుడు ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో ఫ్లాపులు వస్తుంటే అంత నిరుత్సాహ పరుస్తారు. అసలే తక్కువ కెరీర్ స్పాన్ ఉన్న హీరోయిన్స్ ఈ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాల్సి ఉంటుంది. తెలుగులో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తర్వాత వరుస వరుస ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి పరిస్థితి అలానే ఉంది.
ఉప్పెనతో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ మనసులు దోచేసింది. ఇండస్ట్రీకి మరో స్టార్ హీరోయిన్ వచ్చేసిందని అనుకున్నారు. ఆ సినిమా టైం లో కృతి శెట్టి కనబడితే చాలు సోషల్ మీడియా అంతా ఒక రేంజ్ లో హడావిడి కనిపించేది. ఉప్పెన తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా పర్వాలేదు అనిపించాయి. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు సినిమా.. వరుస ఫ్లాపులు అమ్మడి గ్రాఫ్ పడిపోయేలా చేశాయి.
ఉప్పెనతో ఏర్పడిన క్రేజ్ అంతా కూడా వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. అప్పుడు తన కోసం వెంట పడ్డ దర్శక నిర్మాతలు ఇప్పుడు తను చేస్తానన్నా మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమా ఒక్కటే అమ్మడి చేతిలో ఉంది. ఆ సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది కృతి శెట్టి. టాలీవుడ్ లో ఎంత స్పీడ్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకుందో అంతే స్పీడ్ గా కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.
అందుకే కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే గ్లామర్ విషయంలో టాప్ గేర్ వేయక తప్పదని డిసైడ్ అయ్యింది. అందుకే ఎంట్రీ ఇచ్చిన టైం లో స్కిన్ షోకి అసలు ఛాన్స్ ఇవ్వని అమ్మడు ఈమధ్య గ్లామర్ షో తో ఎట్రాక్ట్ చేస్తుంది. తనలో ఈ గ్లామర్ యాంగిల్ కూడా వాడుకోండని మేకర్స్ కి హింట్ ఇస్తుంది బేబమ్మ. సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉండలేక వరుస ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది కృతి శెట్టి. అంతేకాదు ఇక మీదట గ్లామర్ రోల్స్ కి సై అనేలా ఫోటో షూట్స్ తో కష్టపడుతుంది. మరి అమ్మడి కష్టాన్ని గుర్తించి ఏ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాడో చూడాలి.