కృతి సనన్.. వ్వాటే క్రేజీ లుక్
రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల సుందరి కృతి సనన్. ఈ అమ్మడు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తరువాత హిందీలో టైగర్ ష్రాఫ్ తో ‘హీరోపంతి’ సినిమాలో నటించింది. ఈ మూవీ సక్సెస్ తో బాలీవుడ్ ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. మొదటి చిత్రం తర్వాత తెలుగులో నాగ చైతన్యకి జోడీగా ‘దోచేయ్’ మూవీలో కృతి సనన్ నటించింది.
ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. షారుఖ్ ఖాన్ తో చేసిన ‘దిల్ వాలే’ సినిమా ఆమె ఫేట్ ని మార్చేసింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కృతి సనన్ మారిపోయింది. ఈ ఏడాది కృతి సనన్ కార్తీక్ ఆర్యన్ కి జోడీగా ‘తెరి బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా’ మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది.
తరువాత ‘క్రూ’ అనే లేడీ ఒరియాంటెడ్ చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించి ప్రొడ్యూస్ చేసిన ‘దో పత్తి’ అనే థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకాదరణ బాగానే వస్తోంది. ఇలా వరుస విజయాలతో బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీ టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో వీటికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. ఇదిలా ఉంటే కృతి సనన్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది. ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. ఇన్ స్టాగ్రామ్ లో కృతి సనన్ కి ఏకంగా 58.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ తన ఇన్ స్టాగ్రామ్ లో కృతి సనన్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. బ్లూ కలర్ మోడ్రన్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ ఈ ఫోటోలలో మెరిసిపోతోంది. అదిరే అందంతో కృతి సనన్ ఈ లుక్స్ తో మాయ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ కి కేరాఫ్ గా కృతి సనన్ ఉందని ప్రశంసిస్తున్నారు. బ్యూటీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది.