కృతి సనోన్ క్రేజీ మూవీ.. చివరికి ఓటీటీలోనే..

అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ ఈ మూవీలో పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించారు.

Update: 2024-10-15 15:30 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న కృతి సనోన్ నిర్మాతగా మారి ‘దోపత్తి’ అనే సినిమా నిర్మించింది. ఈ సినిమాలో ఆమె ట్విన్ సిస్టర్స్ గా రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతోంది. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ ఈ మూవీలో పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించారు. ఆమె పాత్ర కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది.


శశాంక్ చతుర్వేది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుల్లితెర సీరియల్ యాక్టర్ షహీర్ షేక్ ఈ చిత్రంతో బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అక్టోబర్ 25న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ‘దోపత్తి’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీలో కృతి సనోన్ ఒక క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తోంది. కనిపించకుండా పోయిన గీత తన సిస్టర్ సీత లైఫ్ లోకి మరల వస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ని ఫ్లట్ చేస్తూ ఇద్దరి జీవితాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి ముగ్గురు జీవితాలలో జరిగిన సంఘటనల ఇతివృత్తంగా ‘దోపత్తి’ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ గా కాజోల్ కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత కాజోల్ ని ఫ్యాన్స్ లేడీ సింగం అంటూ కామెంట్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ బాజీరావ్ సింగం పాత్రలో ఇప్పటికే బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేసాడు. ఈ నేపథ్యంలోనే కాజోల్ ని లేడీ సింగం అంటూ ప్రశంసిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై కృతి సనన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

ఓటీటీలో ఇలాంటి చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. తాప్సి నటించిన ‘హసీనా దిల్ రూబా’ ఇలాంటి జోనర్ లోనే వచ్చి సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా వచ్చిన మూవీ కూడా హిట్ అయ్యింది. ఆ సినిమాకి కథ అందించిన కనికా థిల్లాన్ ‘దోపత్తి’ సినిమాకి కూడా స్టోరీ రాయడం విశేషం. హిందీలో మోస్ట్ ప్రామిసింగ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు ఎట్రాక్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News