పరిశ్రమ ఆలోచన మారాలన్న కృతి
కృతి సనన్ 2014లో హీరోపంథి అనే హిందీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది.
కృతి సనన్ 2014లో హీరోపంథి అనే హిందీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి కెరీర్ పరంగా హెచ్చు తగ్గులను చూస్తూనే ఉంది. టాలీవుడ్ లో 1- నేనొక్కడినే, దోచేయ్ లాంటి సినిమాల్లో నటించినా కానీ, ఇక్కడ సరైన విజయం దక్కలేదు. ఆదిపురుష్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించినా కానీ మరోసారి పరాభవం ఎదురైంది. కానీ మిలీ అనే చిత్రంలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుదకుంది. ఈ సంవత్సరం తేరీ వతన్ మే ఐసా ఉల్జా జియా - క్రూతో రెండు వరుస హిట్‌లను సాధించింది. కృతి హిందీ చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరంతో ఒక దశాబ్దం పూర్తి చేసుకోనుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ పదేళ్ల కెరీర్ ని రివ్యూ చేస్తూ కెరీర్ ఆరంభం తాను ఎదుర్కొన్న వెతల గురించి మాట్లాడింది. ఇప్పటివరకు తన అనుభవాలు ప్రయాణం గురించి కృతి మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడింది.
తన సామర్థ్యం మేరకు నటించే అవకాశాలు కల్పించలేదని కృతి తెలిపింది. ఆ సమయంలో నేను కొంతమంది కొత్త ముఖాలను కూడా చూశాను. వారిలో కొందరు సినిమా నేపథ్యానికి చెందినవారు.. ఏమీ చేయకుండానే వచ్చారు.. కానీ కాలక్రమంలో నా ప్రతిభను అర్థం చేసుకుని నాకు నచ్చిన అవకాశాలను ఇచ్చారు అని కృతి తెలిపింది.
కృతిని ఇప్పటివరకూ డిఫరెంట్ షేడ్స్‌లో చూశాం. మిమీలో సరోగసి తల్లిగా నటించినా, తేరీ వతన్ మే ఐసా ఉల్జా జియాలో రోబోగా నటించినా ఆదిపురుష్ లో సీతగా నటించినా ప్రతి పాత్రలోనూ మెప్పించింది. ఇప్పుడు క్రూలో ఎయిర్ హోస్టెస్ గా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది.
తాజాగా క్రూ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. విజయోత్సవం సందర్భంగా కృతి మాట్లాడుతూ .. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కోసం జనం థియేటర్లకు రారు అనే అపప్రద పరిశ్రమలో ఉంది. జనాలు టికెట్ కి చెల్లించే ధరకు గిట్టుబాటు కాదని భావిస్తారు. కానీ దర్శకనిర్మాతల ఆలోచన సరైనది కాదని ప్రూవ్ అయింది. పరిశ్రమ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని కృతి సక్సెస్ వేదికపై అన్నారు.