పిజ్జాతో ఉత్తమ నటి ఆనందాన్ని పంచుకున్న కుటుంబం!
'మా ఇంట్లూ న్యూ ఇయర్ వేడుకైనా ఇంకే వేడుకైనా సరే పిజ్జాతో మొదలవుతుంది. ఆ రోజు నా గెలుపు గురించి తెలిసిన తర్వాత మా అమ్మ పిజ్జా ఆర్డర్ చేద్దాం అన్నారు.
69వ జాతీయ అవార్డు వేడుకల్లో బాలీవుడ్ నటి కృతిసనన్ ఉత్తమ నటిగా ఎంపికైన సంగతి తెలిసిం. ఆమె నటించిన 'మిమీ' సినిమాకు గానూ అమ్మడికి ఈ గుర్తింపు దక్కింది. ఈ అవార్డు రావడం తను అస్సలు ఊహించలేకపోతున్నానని ఎగ్జైట్ మెంట్ కి గురైంది.' నేను ఆ రోజు సాయంత్రం ఓ మీటింగ్ లో ఉన్నాను. ఒక్కసారిగా కాల్స్ రావడం మొదలైంది. ఏం జరుగుతుందో అర్దం కాలేదు. సాధారణంగా మీటింగ్ సమయాల్లో ఫోన్లు వాడను.
కానీ ఆ రోజు పదే పదే కాల్స్ రావడంతో ఫోన్ తీసుకుని బయటకొచ్చి అన్సర్ చేసాను. వెంటనే అవార్డు వచ్చిందన్న విషయం చెవిన పడింది. ఆ సమయంలో ఒక్కసారిగా అంతా శూన్యంలా అనిపించింది. జీవితంలో అత్యంత పురస్కారం అందుకున్న సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఇంటికి బయల్దేరాను' అంది. 'ఇంటికి చేరిన తర్వాత ఆ సంతోష గడియల్ని గుర్తు చేసుకున్నాను.
'మా ఇంట్లూ న్యూ ఇయర్ వేడుకైనా ఇంకే వేడుకైనా సరే పిజ్జాతో మొదలవుతుంది. ఆ రోజు నా గెలుపు గురించి తెలిసిన తర్వాత మా అమ్మ పిజ్జా ఆర్డర్ చేద్దాం అన్నారు. పిజ్జా ఇంటికి డెలివిరీ అయిన తర్వాత ఆ మధురమైన క్షణాన్ని పిజ్జాతో కుటుంబంతో సెలబ్రేట్ చేసుకున్నాను. అభిమానులకు..దేవుడుకు కృతజ్ఞతలు తెలపుతూ నేను పడిన కష్టానికి..చేసిన ప్రార్ధనలకు ఫలితం దక్కింది.
నా జీవితం..నా కలలు.. నాలక్ష్యాల గురించి ముందుగానే డైరీ రాసి పెట్టుకున్నా. అనుకున్నట్లుగానే గెలిచాను' అని కృతి సనన్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ అమ్మడు టాలీవుడ్ కి సుపరిచితమే. 'వన్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'దోచెయ్' లో నటించింది. అటుపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' లోనూ నటించింది. కానీ ఈ మూడు సినిమాలు కూడా కృతికి సరైన సక్సెస్ ఇవ్వలేదు. అలా తెలుగు లో గొప్ప అవకాశాలు వరించినా విజయాల పరంగా నిలవలేకపోయింది.