FAKE పై కృతి ప‌రువు న‌ష్టం దావా

పాపుల‌ర్ ట్రేడింగ్ కంపెనీల‌తో త‌న అనుబంధం ప్ర‌చారంపై త‌ప్పుడు క‌థ‌నాలు రావ‌డంపై కృతి గుర్రుగా ఉంది

Update: 2023-12-03 07:46 GMT

పాపుల‌ర్ ట్రేడింగ్ కంపెనీల‌తో త‌న అనుబంధం ప్ర‌చారంపై త‌ప్పుడు క‌థ‌నాలు రావ‌డంపై కృతి గుర్రుగా ఉంది. ఈ మ్యాట‌ర్ సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంది. ప‌రువు న‌ష్టం దావా వ‌ర‌కూ వెళ్లింది. వివ‌రాల్లోకి వెళితే.. కరణ్ జోహార్ పాపులర్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్‌'లో తాను కనిపించవచ్చని కృతి సనన్ గతంలో ఛూఛాయ‌గా పేర్కొంది. జాన్వీ కపూర్‌తో కలిసి కాఫీ సోఫాను అలంకరించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాల న‌డుమ‌ కృతిపై తప్పుడు ప్ర‌చారం సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంది. ఇదే విషయమై కృతి ఒక ప్రకటన విడుదల చేసింది. త‌న‌పై తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

తాను 'కాఫీ విత్ కరణ్ 8'లో కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయని కృతి చెప్పారు. ఈ వాదనలను డిసెంబర్ 8 ఆదివారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఖండించారు. అవ‌న్నీ ఫేక్ న్యూస్ అని కృతి కొట్టి పారేసింది. ఈ పరువు నష్టం కలిగించే వార్త‌ల‌పై తాను చట్టపరమైన చర్య తీసుకున్నట్లు కూడా వెల్లడించింది. కృతి సామాజిక మాధ్య‌మంలో ఇలా రాసింది. ''కాఫీ విత్ కరణ్‌లో కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేస్తున్నాను అంటూ నా గురించి ప‌లు తప్పుడు కథనాలు వచ్చాయి. ఈ కథనాలు పూర్తిగా నకిలీవి.. నిజాయితీ లేని దుర్మార్గపు ఉద్దేశ్యంతో ప్రచురించిన‌వి. అన్నీ అబ‌ద్ధాలు'' అని వ్యాఖ్యానించింది. ''ఈ కథనాలు పరువు నష్టం కలిగించేవి.. ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో తప్పుడు అనుబంధం క‌లుపుతూ స‌మ‌స్యాత్మ‌కంగా రాస్తున్నారు. షోలో ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అటువంటి తప్పుడు కథనాలు నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్ నోటీసు జారీ చేసాను. ఇలాంటి తప్పుడు నకిలీ, పరువు నష్టం కలిగించే క‌థ‌నాల‌పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను''అని అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ ఏడాది ఆదిపురుష్ 3డి కృతిని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇటీవల టైగర్ ష్రాఫ్‌తో గణపత్‌లో కనిపించింది. హీరోపంటిలో కలిసి నటించిన తర్వాత ఈ చిత్రం వారి రెండవ కలయిక ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా ఫెయిలైంది. దీంతో మరోసారి నిరాశ త‌ప్ప‌లేదు. కానీ 'మిమీ'లో నట‌న‌కు గాను కృతి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకోవ‌డం పెద్ద ఊర‌ట‌. తదుపరి పేరులేని ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీలో షాహిద్ కపూర్‌తో కలిసి కనిపించనుంది. టబు, దిల్జిత్ దోసాంజ్, కరీనా కపూర్ ఖాన్‌లతో కలిసి 'ది క్రూ' సెట్ప్ పై ఉంది. కాఫీ విత్ కరణ్ విషయానికొస్తే.. ఈ షోలో కృతి- జాన్వీల ప్రదర్శనను మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు.

Tags:    

Similar News