కింగ్‌తో ధనుష్ సీన్స్ ప్లాన్ చేసిన కమ్ముల
పౌరాణిక టచ్ ఉన్న ఈ సినిమాలో ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ లను ప్రదర్శించగా..వారి విభిన్నమైన పాత్రలు ఆకర్షించాయి.
తమిళ సూపర్ స్టార్ ధనుష్ - టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `కుబేర` ప్రధాన యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజధానిలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది.
సినిమా తారాగణం అంతా ఈ భారీ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున ఇద్దరూ కొన్ని ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయనున్నారు. పౌరాణిక టచ్ ఉన్న ఈ సినిమాలో ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ లను ప్రదర్శించగా..వారి విభిన్నమైన పాత్రలు ఆకర్షించాయి.
రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిలింమేకర్ గా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని ఒక గొప్ప విజన్ తో తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు పెద్ద తారలు ప్రధాన పాత్రలు పోషించడం.. ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా చేరడంతో కుబేరపై భారీ అంచనాలేర్పడ్డాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర పాన్-ఇండియా బహుభాషా చిత్రం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. అన్ని భాషల్లో అత్యంత భారీగా విడుదలవుతుంది.