ఖుషి బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

ఇక మొత్తంగా చూసుకుంటే ఖుషి సినిమా ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Update: 2023-08-19 13:17 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఖుషి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే చివరగా వచ్చిన లైగర్ సినిమా ఊహించని విధంగా దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో నష్టాలను కలుగచేయడమే కాకుండా విజయ్ సక్సెస్ రేట్ ను ఒక్కసారిగా కిందకు నెట్టేసింది.

అంతకు ముందు వరకు కూడా విజయ్ కొన్ని ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. కానీ లైగర్ సినిమా అయితే అతని కెరీర్ లోనే మర్చిపోలేని నష్టాలను కలిగిచింది. ఇక ఎలాగైనా మళ్ళీ ఖుషి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వస్తున్నాయి.

అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో కూడా సినిమాను మంచి హైప్ తో విడుదల చేయాలి అని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ అయితే ఏర్పడింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఖుషి సినిమా ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

సీడెడ్ ఏరియాలో కూడా 6 కోట్ల రేంజ్ లో ధర పలికిన ఈ సినిమా నైజాం ఏరియాలో 15 కోట్ల రేంజ్ లోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం చూసుకుంటే 3.5 కోట్లు, ఓవర్సీస్ లో 7.5 కోట్ల ధర పలికిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ గా 52 కోట్ల స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ట్యాగ్ అందుకోవాలి అంటే 53 కోట్ల షేర్ అందుకోవాలి. ఈ సినిమాను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 20 కోట్ల భారీ బడ్జెట్ తో అయితే నిర్మించింది. ఇక తప్పకుండా సక్సెస్ అందుకోవాలి అని ఆ సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తోంది. దర్శకుడు శివా నిర్వాణ ఈ సినిమాను ప్యూర్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News