ఖుషి.. ఎవరెవరికి ఎంత ఇచ్చారంటే..
అయితే ఈ బడ్జెట్ లో మెజారిటీ రెమ్యునరేషన్ రూపంలోనే నిర్మాతకి ఖర్చయినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మూవీ ఖుషి. సమంత ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటించింది. రొమాంటిక్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ఖుషి మూవీ రిలీజ్ అవుతోంది.
అన్ని భాషలకి యాప్ట్ అయ్యే టైటిల్ కావడంతో దీనిని పెట్టారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పై ఉంది. సుమారు 60 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే థీయాట్రికల్ బిజినెస్ 50 కోట్ల వరకు అన్ని భాషలలో కలిపి జరిగిందంట. అయితే ఈ బడ్జెట్ లో మెజారిటీ రెమ్యునరేషన్ రూపంలోనే నిర్మాతకి ఖర్చయినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 23 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారంట. ఇక సమంత 4.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. సమంత కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ చిత్రానికి అందుకుందని టాక్. ఇక దర్శకుడు శివ నిర్వాణ కూడా 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిగిలిన వారి రెమ్యునరేషన్స్ కలుపుకొని 50 కోట్ల బడ్జెట్ అయ్యిందంట.
మిగిలించి ప్రొడక్షన్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటికే సినిమాకి సగం పెట్టుబడి వెనక్కి తిరిగివచ్చేసినట్లు టాక్. అయిన కానీ విజయ్, సమంతకి ఉన్న క్రేజ్, అలాగే పాజిటివ్ బజ్ కారణంగా 50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో రీసెంట్ గా సీతారామం సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్ ఖుషి సినిమాకి కూడా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. ఖుషి కూడా సీతారామం తరహాలోనే ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం కావడం విశేషం.