టాలెంట్ హీరోను మెప్పించిన జాతిరత్నం
సురేష్ ప్రొడక్షన్ కూడా అనుదీప్ దర్శకత్వంలో కంప్లీట్ కామెడీతో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు.
జాతిరత్నాలు సినిమాతో ఫుల్ హ్యూమర్ క్రియేట్ చేసి టాలెంటెడ్ దర్శకుడు అనిపించుకున్న కేవీ అనుదీప్ తరువాత శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. జాతిరత్నాలు సినిమాలో వర్క్ అవుట్ అయిన హ్యూమర్ ప్రిన్స్ మూవీలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మూవీలో బలమైన కథ లేదని ప్రేక్షకులు తిరస్కరించారు. తరువాత అనుదీప్ విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథని సిద్ధం చేశారు.
సురేష్ ప్రొడక్షన్ కూడా అనుదీప్ దర్శకత్వంలో కంప్లీట్ కామెడీతో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. చాలా రోజులు వర్క్ జరిగిన తర్వాత కథ విషయంలో సురేష్ బాబు సంతృప్తికరంగా లేకపోవడం అది కార్యరూపం దాల్చలేదంట. నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజతో సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే ఎందుకనో దానిని ఎనౌన్స్ చేయలేదు.
అలాగే నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మూవీ ఉందనే టాక్ కూడా జోరుగా సాగింది. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు అనుదీప్ ప్రయత్నాలు వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ అయ్యింది. విశ్వక్ సేన్ 14వ చిత్రంగా దీనిని ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ఒక ఎనౌన్సమెంట్ పోస్టర్ తో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఈ మూవీ అనుదీప్ స్టైల్ కామెడీతో పాటుగా విశ్వక్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉందంట. త్వరలో సినిమాకి సంబందించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. విశ్వక్ సేన్ తో మూవీ అంటే కచ్చితంగా అతని ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది.
ప్రతి సినిమాలో కూడా తన బెస్ట్ ఇవ్వడానికి విశ్వక్ సేన్ ప్రయత్నం చేస్తాడు. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ పూర్తిస్థాయిలో కామిక్ క్యారెక్టర్ ని చేయలేదు. అందుకే అనుదీప్ కథకి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. తనలోని ఉన్న ప్రతి యాక్టింగ్ లేయర్ ని విశ్వక్ సేన్ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అయన హీరోగా నటించిన మెకానిక్ రాకీ అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.