ఒకరి భార్య మరొకరికి.. ఓటీటీలోకి హిట్ మూవీ!
ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. నేడు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. మినిమమ్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇప్పటికే ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన దోబీ ఘాట్, తారే జమీన్ పర్, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా అమీర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'లాపటా లేడీస్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జమ్తారా వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ హీరోగా నటించిన ఈ మూవీ.. మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ సినిమాను అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ తెరకెక్కించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మెగా ఫోన్ పట్టారు. 2010లో ఆమె చివరగా 'దోబీ ఘాట్' చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'లాపటా లేడీస్'తో పలకరించారు కిరణ్ రావ్. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సుమారుగా రూ.30 కోట్లు కలెక్ట్ చేసి పలు రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. నేడు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. సుమారు 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఆకట్టుకునే కథనం, సూపర్ యాక్టింగ్, డైలాగులు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండడంతో 'లాపటా లేడీస్' మూవీకి బీ టౌన్ థియేటర్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 2024లో బెస్ట్ మూవీ అంటూ కొనియాడారు. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమా మరిన్ని ప్రశంసలు అందుకుంటుందని సినీ పండితులు చెబుతున్నారు.
కథేంటి?
ఈ సినిమా అంతా పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగుతోంది. కొత్తగా పెళ్లి అయిన ఓ కపుల్ ఇంటికి రైలులో వెళ్తుంది. ఆ సమయంలో నవ వధువు మిస్ అవుతుంది. దీంతో ఆ వరుడు మరొకరి భార్యను తీసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి చేరుకున్నాక అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే అతడి భార్య ఎలా తప్పిపోయింది? చివరకు ఏం జరిగిందనేది మిగతా సినిమా.