టీజర్: రన్నింగ్ ట్రైన్లో వధువు మిస్సయితే..!
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు 12 సంవత్సరాల తర్వాత దర్శకురాలిగా పునఃప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు 12 సంవత్సరాల తర్వాత దర్శకురాలిగా పునఃప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'లపాటా లేడీస్' టీజర్ ఆన్లైన్లో విడుదలైంది. కిరణ్ మాజీ భర్త, అమీర్ సమర్పణలో 'లపాటా లేడీస్' మరొక స్లైస్-ఆఫ్-లైఫ్ కామెడీ-డ్రామాగా రూపొందింది. ఇందులో రవి కిషన్ ఇద్దరు తప్పిపోయిన వధువులను వెతికే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
2010లో వచ్చిన ధోబీ ఘాట్ (ముంబయి డైరీస్) చిత్రం తర్వాత కిరణ్ రావు దర్శకురాలిగా కంబ్యాక్ అవుతున్న చిత్రమిది. లపాటా లేడీస్ టీజర్ గ్రామీణ భారతం బ్యాక్‌డ్రాప్‌కి తీసుకువెళుతోంది. తప్పిపోయిన ఇద్దరు వధువుల కోసం అన్వేషణ, గందరగోళం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎంటర్ టైనర్ ఇదని టీజర్ వెల్లడిస్తోంది. నిజమైన సిట్యుయేషనల్ కామెడీ తో ఈ సినిమా అలరించనుందని టీజర్ రివీల్ చేస్తోంది.
2001 నాటి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు యువ వధువులు రైలు నుండి తప్పిపోయాక ఎలాంటి గందరగోళం ఎదురైంది? అన్నది 'లపాటా లేడీస్' కథాంశం. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా కంబ్యాక్ కోసం ఇటీవలే రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో టై అప్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందే చాంపియన్స్ అనే సినిమాతో నటిడిగా బరిలోకొస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతగాను మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. లపాటా లేడీస్ తో అతడు విజయం అందుకుంటాడనే ఆశిద్దాం.