ప్ర‌పంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ ఎక్క‌డుంది?

ఈ స్క్రీన్ పై అద్భుతమైన విజువల్స్ తాలూకా క్లిప్ లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2023-09-13 14:53 GMT

హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ IMAX - సూళ్లూరుపేట V ఎపిక్ స్క్రీన్ లు ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్క్రీన్ల జాబితాలో ఉన్నాయ‌ని మ‌న‌కు తెలుసు. అయితే ఇప్పుడు లాస్ వెగాస్‌లో ప్రారంభించ‌నున్న ఈ భారీ స్క్రీన్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. వంద‌ల కోట్లు వెచ్చించి రూపొందించిన అద్భుత స్క్రీన్ ఇద‌ని చెబుతున్నారు. ఇది న‌మ్మ‌శ‌క్యం కాని సినిమా వీక్షణ అనుభవాన్ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంది. ఈ స్క్రీన్ పై అద్భుతమైన విజువల్స్ తాలూకా క్లిప్ లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

ఇంత‌కీ ఈ లార్జ్ స్క్రీన్ ప్ర‌త్యేక‌త ఏమిటీ? అంటే.. ఇది 366 అడుగుల పొడవు .. 516 అడుగుల వెడల్పుతో ఏకకాలంలో 18,600 మంది వీక్షకులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది పెద్ద - చిన్న సైజుల్లో 1,60,000 స్పీకర్లను కలిగి ఉంది. కంటెంట్ సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 18K రిజల్యూషన్‌తో మెస్మరైజింగ్ వేలో ప్రదర్శిత‌మ‌వుతుంది, ప్రతి మూవీకి 5,00,000 గిగాబైట్ల భారీ ఫైల్ పరిమాణం అవసరం.

డారెన్ అరోనోఫ్స్కీ తెర‌కెక్కించిన‌ #PostCardFromEarth అక్టోబర్ 6న ఇక్కడ ప్రీమియర్ అవుతుంది.ఈ షో వీక్ష‌కుల‌కు జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. టిక్కెట్ ధరలు ఎలా ఉండ‌నున్నాయో ఇప్ప‌టికి తెలీదు.

ప్ర‌పంచంలో అతిపెద్ద లార్జ్ స్క్రీన్ గా పాపుల‌రైన ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని తొల‌గించ‌డం హైద‌రాబాదీల‌కు తీవ్ర నిరాశ‌. ఆ స్థానంలో మ‌రో కొత్త సాంకేతిక‌త‌తో థియేట‌ర్ స్క్రీన్ ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు లాస్ వేగాస్ లో ప్రారంభం కానున్న లార్జ్ స్క్రీన్ టెక్నాల‌జీతో మ‌న దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి థియేట‌ర్ రావాల‌ని కోరుకోవ‌డం సినీప్రేమికుల త‌ప్పేమీ కాదు.

Tags:    

Similar News