వరుణ్ తేజ్.. లైన్ లో మరో ఫ్లాప్ డైరెక్టర్?
లేటెస్ట్ టాక్ ప్రకారం, మేర్లపాక గాంధీ చెప్పిన కథను వరుణ్ తేజ్ అంగీకరించారని టాక్.
తెలుగు సినిమా రంగంలో ఇటీవల వరుస డిజాస్టర్స్ అందుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఇక ఇప్పుడు ఈ మెగా ప్రిన్స్ తన సక్సెస్ ట్రాక్‌ను తిరిగి సెట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "మట్కా" చిత్రంతో మరలా బలంగా పుంజుకోవాలనే ఆశతో ఉన్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, వరుణ్ తేజ్ అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో విజయం సాధిస్తుందని నిర్మాతలు విశ్వసిస్తున్నారు.
మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది, ఇందులోని మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వరుణ్ తేజ్ పాత్రలోని విభిన్న లుక్స్ ఈ చిత్రానికి పాజిటివ్ హైప్ తెచ్చాయి. "లక్కీ భాస్కర్"తో ఇటీవల సాలీడ్ హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో నటిస్తుండగా, అదే సినిమాకు సంగీతం అందించిన జివి ప్రకాష్ కుమార్ కూడా మట్కా చిత్రానికి పని చేయడం మరో విశేషం. ఇక వరుణ్ తేజ్ మట్కా అనంతరం మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మట్కా తరువాత వరుణ్ తేజ్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనే ఆసక్తి కూడా ఉంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, మేర్లపాక గాంధీ చెప్పిన కథను వరుణ్ తేజ్ అంగీకరించారని టాక్. రాయలసీమ నేపథ్యంలో హారర్ మరియు కామెడీ అంశాలను మిళితం చేసిన ఈ వెరైటీ కథతో ప్రేక్షకులను అలరించేందుకు గాంధీ సిద్ధమవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో "వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్" మరియు "ఎక్స్‌ప్రెస్ రాజా" సినిమాలతో హిట్లు అందుకున్న గాంధీకి ఆ తర్వాత పెద్దగా విజయాలు దక్కలేదు.
"కృష్ణార్జున యుద్ధం", "మాస్ట్రో" వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినప్పటికీ అతనికి మంచి అవకాశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి గాంధీ పక్కా హిట్ కోసం వరుణ్ తేజ్ కోసం కథ సిద్ధం చేశాడని టాక్. ఇదిలా ఉంటే, గద్దలకొండ గణేష్ వంటి మాస్ రోల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత విభిన్నమైన ప్రయోగాలు చేయడంతో మాస్ ఆడియన్స్ కొంత దూరమైపోయారని చెప్పవచ్చు. అందుకే మట్కాతో మళ్ళీ ఆ రేంజ్ కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే, వరుణ్ కెరీర్లో మరో మంచి మలుపు రావడం ఖాయం. అలాగే మరో కొత్త దర్శకుడికి కూడా వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.