రాజ్ తరుణ్ పై రోజుకొక ఆరోపణ!.. లావణ్య ఏమందంటే?
దీంతో వారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ - లావణ్యల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాజ్ తరుణ్ ఓసారి మీడియా ముందుకు వచ్చారు. లావణ్య మాత్రం రాజ్ తరుణ్ పై రోజుకొక ఆరోపణ చేస్తోంది! ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ముందు సహజీవనం.. తర్వాత పెళ్లి.. రీసెంట్ గా అబార్షన్ అని చెప్పింది. దీంతో వారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు మరోసారి లావణ్య తన విషయంపై మీడియాతో మాట్లాడింది.
"మొత్తం పది సంవత్సరాల జీవితం. ఒక నెలో.. సంవత్సరమో అయితే పరిస్థితి వేరేలా ఉండేది. పది సంవత్సరాలు కాబట్టి చాలా జరుగుతాయి. రికార్డింగ్ ను రిలీజ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి కూడా రాజ్ తరుణ్ కు యాంటీగా లేను. ఆ మనిషి నాకు కావాలి. వద్దని వదిలించుకుంటుంది అతను. సెప్టెంబర్ లో మేం మాట్లాడిన కాల్ రికార్డింగ్ ను బీప్స్ వేసి షేర్ చేశారు. బూతులు ఉన్నాయి. నేను కోపంలో, బాధలో తిట్టాను" అని చెప్పింది.
"ఏమీ లేకుండా చేయడానికి పిచ్చి దాన్ని అయితే కాదు. అందరూ నన్ను చూస్తున్నారు. పిచ్చి ఉందో లేదో అందరికీ తెలుసు. రిలేషన్ షిప్ లో ఉన్నామని కంప్లైంట్ లో రాశాను. మా రిలేషన్ షిప్ మధ్యలోకి మాల్వీ మల్హోత్రా అనే అమ్మాయి వచ్చింది. ఆమెతో ఇబ్బందులు ఉన్నాయి. ఆ అమ్మాయి నాకు వార్నింగ్ ఇచ్చింది. సహజీవనం, పెళ్లి అనేది మ్యాటర్ కాదు. అయితే మా పెళ్లి అయ్యాక తాళిబొట్టు మూడేళ్లపాటు వేసుకున్నాను" అని తెలిపింది.
"కానీ మాకు పెళ్లయినట్లు లీగల్ గా ఎవరికీ తెలియదు. అతనితో ఎక్కడికి వెళ్లినా.. ఏదైనా ఉన్నా.. నేను వేసుకోలేను. నా వల్ల, మా పెళ్లి వల్ల ఆయన కెరీర్ కు ఇబ్బంది ఉండకూడదని భావించాను. ఆయన క్రేజ్ తగ్గకూడదని చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. అంతే తప్ప రెస్పెక్ట్ లేక కాదు. ఫస్ట్ మూడేళ్లు తాళిబొట్టు వేసుకునే ఉన్నా. వాళ్ల ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు పోలీసులకు సబ్మిట్ చేశాను" అని తెలిపింది. అయితే పెళ్లిని రహస్యంగా ఎందుకు రాజ్ తరుణ్ ఉంచారని అడిగారు జర్నలిస్ట్.
"మా పెళ్లిని రహస్యంగా ఉంచుకోవాలని అనుకోలేదు. టైమ్ చూసి చెబుతామనుకున్నాం. మరోసారి పెళ్లి.. లీగల్ గా చేసుకుందామనుకున్నాం. ఆయనకు 27 ఏళ్లు వచ్చాక చేసుకుందామనుకున్న టైమ్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. పేరెంట్స్ ఒత్తిడి వల్ల వాళ్లకు మళ్లీ పెళ్లి చేసుకుంటామని చెప్పాం" అని తెలిపింది. అబార్షన్ విషయంపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది లావణ్య. అది సెన్సిటివ్ టాపిక్ అని చెప్పింది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.