పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తారు - లావణ్య

టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మాల్వీ మల్హోత్రా ఇల్లీగర్ ఎఫైర్ ఆరోపణలు ఎదుర్కోవడం కేసులలో ఇరుక్కోవడం జరిగింది.

Update: 2024-07-11 12:42 GMT

హీరో రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య వ్యవహారం ఇప్పుడు కేసుల వరకు వచ్చింది. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. మరో వైపు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపైన కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది మాల్వీ మల్హోత్రా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా లావణ్యపై బెదిరింపులు, వ్యక్తిత్వ హననం అభియోగాలపై కేసు నమోదు చేసారంట.

టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మాల్వీ మల్హోత్రా ఇల్లీగర్ ఎఫైర్ ఆరోపణలు ఎదుర్కోవడం కేసులలో ఇరుక్కోవడం జరిగింది. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ కి ఈ రకమైన పరిస్థితి మొదటిసారి ఎదురైనట్లు తెలుస్తోంది. తిరగబడర సామి మూవీ రిలీజ్ కాకుండానే అందులో జంటగా నటించిన రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు వీరి గురించే చర్చ నడుస్తోంది. మీడియాలో సైతం ప్రతిరోజు వీరి గురించి విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లావణ్య ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యాయం కోసం తాను ఎంతవరకైనా పోరాడుతానని పేర్కొంది. రాజ్ తరుణ్ తనకి కావాలని కోరుతుంది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఈ విషయంపై కలుస్తానని లావణ్య పేర్కొంది.

పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమని లావణ్య తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్యల విషయంలో ఎవరిని మోసం చేయలేదని పేర్కొంది. రాజ్ తరుణ్ తనకి చేసిన అన్యాయాన్ని పవన్ దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పుకొచ్చింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని లావణ్య ఇంటర్వ్యూలో తెలిపింది. రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, మోసం చేసాడని పవన్ కళ్యాణ్ కి విన్నవించుకుంటానని లావణ్య తెలిపింది. మరో వైపు లావణ్య తరపున కళ్యాణ్ దిలీప్ సుంకర కేసుని టేకప్ చేసి లీగల్ గా ఫైట్ చేస్తున్నారు.

దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే టాలీవుడ్ లో చాలా మందికి రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ, సహజీవనం గురించి తెలిసిన బయటకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అనవసరమైన తలనొప్పులు ఎందుకని వారి వ్యవహారంతో సంబంధం లేనట్లు ఉన్నారు. రాజ్ తరుణ్ కూడా ఈ కేసు వ్యవహారంలో వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. చట్టపరంగానే ఫైట్ చేయాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News