మెగా కోడలు రిస్క్ చేయనంటుందా..?

మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి ఆలోచనల్లో మార్పు వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు

Update: 2024-06-16 16:30 GMT

మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి ఆలోచనల్లో మార్పు వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పెళ్లి తర్వాత తనకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదని లావణ్య చెబుతున్నా తనకు తానుగానే ఇక మీదట సినిమాల విషయంలో కానీ ఫోటో షూట్స్ విషయంలో కానీ రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యిందట. ఎలాగు కెరీర్ అంత గొప్పగా లేదు ఫోటో షూట్స్ అంటే అవి ఎవరి ఇష్టం వారిది కాబట్టి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అలా అని పూర్తిగా లావణ్య సిల్వర్ స్క్రీన్ కి దూరం అవుతుందా అంటే కాదు కానీ సెలెక్టెడ్ సినిమాలు చేయాలని అనుకుంటుందట అమ్మడు. అంతేకాదు కుదిరితే భర్త వరుణ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తుందట. ఏదైనా కథ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలో రియల్ వైఫ్ అయిన లావణ్యనే రీల్ వైఫ్ గా చేసి మెప్పించాలని అనుకుంటుందట. ఇదో విధంగా మంచి ఆలోచన అని చెప్పొచ్చు.

ఓ పక్క వరుణ్ తేజ్ కెరీర్ కాస్త ఇబ్బందికరంగా మారింది. చేస్తున్న సినిమాలు రిలీజ్ ముందు మంచి బజ్ ఏర్పరచుకుంటున్నా రిలీజ్ తర్వాత డీలా పడుతున్నాయి. కెరీర్ సెట్ రైట్ చేసుకునే పనిలో ఉన్న వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి మరో టెన్షన్ అవ్వకూడదని ఆమె అనుకుంటుందట. సినిమాల కన్నా ఆమె వెబ్ సీరీస్ ల మీద స్పెషల్ ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది. వెబ్ సీరీస్ లు ఐతే సాంగ్స్ కి ఛాన్స్ లేదు.. ఇందులో హీరో హీరోయిన్ అన్నట్టు కాకుండా పాత్రలు ప్రాధాన్యతగా ఉంటాయి.

లావణ్య తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఎలాంటి ఆఫర్లు వచ్చేలా చేస్తుందో చూడాలి. అంతేకాదు పిల్లల విషయంలో కూడా టైం తీసుకోవాలి.. ఇప్పుడే తొందర ఎందుకు అనే ఆలోచన కాకుండా వరుణ్ తేజ్, లావణ్య ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. సో చూస్తుంటే లావణ్య కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయిందనే అనిపిస్తుంది. ఇక ఒక బాబో పాపో వస్తే ఇక ఆమెను హీరోయిన్ గా పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. మెగా కోడలిగా లావణ్య నిర్ణయాలు మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి. సినిమాలు, వెబ్ సీరీస్ లు చేయకపోయినా పర్లేదు కానీ ఫ్యామిలీ సంతోషంగా చూసుకోవాలనుకుంటున్న లావణ్య డెసిషన్ కి మెగా ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంది.

Tags:    

Similar News