ఓకే కానీ నో... లియోకి స్టాలిన్ జలక్!
లియో సినిమా కి బెనిఫిట్ షో పై చాలా ఆశలు.. అంచనాలు అభిమానులు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన లియో సినిమా వచ్చే వారం దసరా సందర్బంగా 19వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళనాట విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యావరేజ్ సినిమా కూడా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పదుల కోట్ల వసూళ్లు రాబట్టడం పరిపాటిగా వస్తుంది. అయితే లియో విషయంలో అలా జరిగే పరిస్థితి లేదు.
స్టార్ హీరోల సినిమాలకు ఎక్కవ కలెక్షన్స్ వచ్చేది బెనిఫిట్ షో ద్వారానే.. ఆ కలెక్షన్స్ ఓపెనింగ్ కలెక్షన్స్ ని ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే స్టార్ హీరోల ఫ్యాన్స్ మరియు నిర్మాతలు కూడా బెనిఫిట్ షో లపై ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ బెనిఫిట్ షో ల కారణంగా సాధారణ జనాలు ఇబ్బందులకు గురి అవుతున్నారు అంటూ స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
హీరో ఎవరైనా కూడా బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఉదయం 4 గంటల షో లు మాత్రమే కాకుండా అయిదు ఆరు గంటలకు కూడా షో వేసేందుకు నిరాకరించింది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే సినిమా థియేటర్ లో బొమ్మ పడాల్సిందే అంటూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది.
లియో సినిమా కి బెనిఫిట్ షో పై చాలా ఆశలు.. అంచనాలు అభిమానులు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లియో సినిమా కి అయిదు షో లకు అనుమతి ఇస్తూనే బెనిఫిట్ షో లకు నిరాకరించింది.
సాధారణంగా నాలుగు షో లు మాత్రమే ఉంటాయి. కానీ లియో కి అయిదు షో లకు అనుమతి ఇచ్చింది. అయితే 9 గంటలకు మాత్రమే షో లు మొదలు అవ్వాలంటూ కండీషన్ పెట్టింది. ఓకే అంటూనే నో చెప్పిన స్టాలిన్ ప్రభుత్వం పై విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యం తోనే స్టాలిన్ ఇలా చేస్తున్నారు అంటూ వారు ఆరోపిస్తున్నారు.