భగవంత్ కేసరి, లియోని లైన్ లో పెట్టిన దిల్ రాజు
ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డు చెల్లించి దిల్ రాజు హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు నిర్మాతగా ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు చూసారని చెప్పొచ్చు. ఆరంభంలో విజయ్ తో చేసిన వారిసు మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే భారీ లాభాలు మాత్రం తెచ్చిపెట్టలేదు. బలగం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అంచనాలకి మించి కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ రెండు సినిమాలతో వచ్చి లాభాలు అన్ని శాకుంతలం మూవీతో పోయాయని చెప్పాలి.
శాకుంతలం మూవీకి దిల్ రాజు 40 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారంట. అయితే 90 శాతం పెట్టుబడి పోయినట్లే అని తెలుస్తోంది. డిస్టిబ్యూటర్ గా దిల్ రాజుకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన కొని రిలీజ్ చేసిన మూవీస్ చాలా వరకు లాభాలు తీసుకొచ్చాయి. ఈ ఏడాది జైలర్ మూవీ రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు 12 కోట్లకి సొంతం చేసుకున్నారు. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వచ్చేసింది.
ప్రస్తుతం జైలర్ నుంచి వస్తోన్న కలెక్షన్స్ అన్ని లాభాలే అని చెప్పాలి. ఇప్పుడు మరో రెండు సినిమాలకి సంబంధించి నైజాం థీయాట్రికల్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో దసరాకి రిలీజ్ కాబోయే భగవంత్ కేసరి మూవీ నైజాం హక్కులని ఫ్యాన్సీ రేటుకి దిల్ రాజు దక్కించుకున్నారంట. ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి.
తమిళంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ లియో మూవీ నైజాం హక్కులని దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డు చెల్లించి దిల్ రాజు హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి, లియో సినిమాలు రెండు దసరాకి రిలీజ్ అవుతున్నాయి.
ఈ రెండింటిపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాల నైజాం హక్కులు దిల్ రాజు చేతిలో ఉండటం వలన కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ రిలీజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఒకటి ఏవరేజ్ అయ్యి ఇంకోటి హిట్ అయిన సేఫ్ గా బయటపడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.