ల‌వ్ స్టోరీలోనూ ఆయ‌న తుపాకీ వ‌ద‌ల‌డా?

మ‌రో ఐదేళ్ల పాటు లోకేష్ నుంచి క్రైమ్ త‌ర‌హా సినిమాలే వ‌స్తాయ‌ని ముందే చెప్పేసాడు.

Update: 2024-12-18 10:30 GMT

కోలీవుడ్ స్టార్ మేక‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరెత్త‌గానే తుపాకీ శ‌బ్దాలు..బాంబుల మోత‌లు...బ్లాస్టింగ్ లు...డ్ర‌గ్స్.. గంజాయి మాత్ర‌మే గుర్తొస్తాయి. 'ఖైదీ'..'విక్ర‌మ్', 'లియో' సినిమాల‌తో పాన్ ఇండియాలో అత‌డు అలాగే ఫేమ‌స్ అయ్యాడు. అత‌డు నిర్మించిన చిత్రాలు కూడా అలాంటివే. 'మైఖెల్', 'ప్లైట్ క్ల‌బ్' చిత్రాల‌తో స‌మ‌ర్పికుడిగానూ లొకేష్ సుప‌రి చితం. ప్ర‌స్తుతం ఎల్ సీయూ లో భాగంగా 'బెంజ్' అనే సినిమాని నిర్మిస్తున్నాడు. మ‌రో ఐదేళ్ల పాటు లోకేష్ నుంచి క్రైమ్ త‌ర‌హా సినిమాలే వ‌స్తాయ‌ని ముందే చెప్పేసాడు.

మ‌రి ఇప్ప‌ట్లో లోకేష్ నుంచి మ‌రో జోన‌ర్ సినిమా ఉండే అవకాశం లేదా? అంటే కాదు కాదు అంటూ కొత్త‌గా త‌న‌లోని రొమాంటిక్ యాంగిల్ ని త‌ట్టి లేపుతున్నాడు. తాజాగా నిర్మాత‌గా మ‌రో సినిమా ప్ర‌క‌టించాడు. రొమాంటిక్ జాన‌ర్ లో ఈ సినిమా ఉంటుంది. మ‌రి ఈ రొమాంటిక్ స్టోరీ కూడా తానే స్వ‌యంగా రాసాడా? ఇంకే ర‌చయిత నుంచైనా తీసుకు న్నాడా? అన్న‌ది తెలియ‌దుగానీ రొమాంటిక్ స్టోరీ అంటూ లొకేష్ మార్క్ యాక్ష‌న్ నుంచి ప్రేక్ష‌కుల్ని బ‌య‌ట‌కు తెస్తున్నాడిలా.

ఇక ఈ చిత్రాన్ని అంతా కొత్త‌వారితో చేయ‌డం మ‌రో విశేషంగా చెప్పాలి. అదీ యూ ట్యూబ్ లో ఫేమ‌స్ అయిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కులుతో చేయ‌డం గొప్ప విష‌యం. ఇందులో యూట్యూబ్ ఫేం భ‌ర‌త్ హీరోగా న‌టిస్తుండ‌గా అదే యూ ట్యూబ్ నుంచి వ‌చ్చిన నిరంజ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ ర‌కంగా కొత్త వారికి త‌న ద్వారా లోకేష్ అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. లోకేష్ తో పాటు మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు కూడా ప్రాజెక్ట్ లో భాగ‌స్వాములు.

అయితే ఇక్క‌డా లొకేష్ మార్క్ ట‌చ్ ఇచ్చాడండోయ్. రిలీజ్ చేసిన పోస్ట‌ర్ చూస్తే ఆసంగ‌తి అర్ద‌మ‌వుతుంది. పోస్ట‌ర్ లో తుపాకీ చూడొచ్చు. పింక్ క‌ల‌ర్ లో ఈ తుపాకీ ఉంది. బ్యాక్ గ్రౌండ్ పోస్ట‌ర్ ప‌సుపు రంగులో ఉంది. అంటే ఈ రొమాంటిక్ స్టోరీ లో కూడా తుపాకీ పెల‌డానికి అవ‌కాశం ఉందా? అన్న సందేహం రావ‌డం స‌హ‌జం. మ‌రి ఈ గ‌న్ పోస్ట‌ర్ కే ప‌రిమిత‌మా? క‌థ‌లో భాగ‌మా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News