ఇలా ఇరకాటంలో పెట్టేసావేంటి లోకేష్!
ఒక దర్శకుడి సినిమా సీన్లను మరో దర్శకుడు తన సినిమాలో మక్కీకి మక్కీ దించేస్తే దాన్ని కాపీ అంటాం. ఆ డైరెక్టర్ లో క్రియేటివిటీ లేదు
ఒక దర్శకుడి సినిమా సీన్లను మరో దర్శకుడు తన సినిమాలో మక్కీకి మక్కీ దించేస్తే దాన్ని కాపీ అంటాం. ఆ డైరెక్టర్ లో క్రియేటివిటీ లేదు. అందుకే ఇలా వేరే దర్శకుల సీన్లను తెచ్చి సినిమా చేసాడని విమర్శి స్తారు. నిజానికి ఇది చాలా మంది దర్శకులు చేసే పనే. సీన్లు కాదు..ఏకంగా స్టోరీలే కాపీ కొట్టి చేస్తారని ఓ సందర్భం లో ఓ స్టార్ డైరెక్టర్ అన్నారు. దానికి స్పూర్తి అని పెడతారని...కానీ అది స్పూర్తి కాదు...లిప్ట్ చేయడం అంటారని అన్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. లేకపోతే తెలియ దుగా... ఈవిధానం టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఫాలో అయ్యేదే. కొత్తగా కాపీ అనే మాట ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందేమో గానీ..మాకు మాత్రం పాతదే అన్నారు. ఇక రాజమౌళి హాలీవుడ్ సినిమాల నుంచి సన్నివేశాలు లిప్ట్ చేస్తారని తన సినిమాల ద్వారా చూసిందే.
'బాహుబలి'లో సన్నివేశాలు..'ఆర్ ఆర్ ఆర్' లో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమా లనుంచి డంప్ చేసినవే. అలాగే త్రివిక్రమ్..సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఇప్పుడీ జాబితాలో పాన్ ఇండియా సంచలనం లోకేష్ కనగరాజ్ ని చేర్చాలా? లేదా? అన్నది ఓ సందేహంగా మారింది. ఎందుకంటే ఆయన ఆయన సినిమాలో సీన్లనే కాపీ కొట్టాడు. వేరే సినిమాలో సన్నివేశాల్ని తెచ్చి తన సినిమాలో పెడితే కాపీ క్యాట్ అనే ముద్ర వేయోచ్చు.
కానీ తన సినిమాలో సీన్ నే తదుపరి సినిమాలో రిపీట్ చేసే సరికి తొందరపడి కాపీ క్యాట్ అని అనలేని సన్నివేశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా 'లియో' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కుర్చీలో కుర్చుని కుమార్తెను గుండెల మీద వేసుకుని జోకొట్టే సీన్ ఉంది. సరిగ్గా ఇదే సీన్ 'విక్రమ్' సినిమాలోనూ ఉంది. అందులో కమల్ హాసన్ మనవడని జో కొడతారు.
ఈ రెండు సీన్లు ఒకేలా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. సోషల్ మీడియాలో ఈ రెండు సన్నివేశాల్ని మిక్స్ చేసి షేర్ చేస్తున్నారు. 'విక్రమ్' దర్శకుడు లొకేష్ కనగరాజ్ కాబట్టి! తన సినిమాలో సీన్ ని యధాతదంగా 'లియో' కోసం తీసుకున్నాడు ..అందులో తప్పేముంది? కాపీ కాదు కదా? అంతకు మించి లోకేష్ యూనివర్శ్ నుంచి వస్తోన్న సినిమా అని అంటున్నారు. తన సినిమా అయినా ప్రేక్షకుల కు..లొకేష్ కీ అది పాత సన్నివేశమే అవుతుంది. అలాంటప్పుడు అందులో కొత్తదనం ఏమునట్లు? ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు విక్రమ్ సీన్ గుర్తుకొస్తుంది కదా. అప్పుడు అది కాపీ అనే అంటారు అన్న వాదన తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా ఇది తెగని పంచాయతీ.