బాబోయ్.. లియో లింకులతో చంపేస్తున్నారు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ తర్వాత రాబోతున్న సినిమా లియో. ఈ మూవీ పై మొదట్లో అయితే ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి

Update: 2023-10-09 10:45 GMT

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ తర్వాత రాబోతున్న సినిమా లియో. ఈ మూవీ పై మొదట్లో అయితే ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇక మళ్లీ చిత్ర యూనిట్ పొరపాట్ల కారణంగా మెల్లగా బజ్ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం అర్థంలేని పోస్టర్లను విడుదల చేయడమే. అందులో విజయ్ లుక్కు కూడా అంతగా ఎట్రాక్ట్ గా లేకపోవడం ట్రోల్స్ కు దారితీసింది.

అంతే కాకుండా ఇటీవల వచ్చిన ట్రైలర్ పై కూడా విభిన్నమైన అభిప్రాయాలు రావడంతో నెగిటివ్ బజ్ వచ్చింది. తమిళంలో విజయ్ రేంజ్ ను బట్టి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు కాబట్టి మిగతా భాషల్లో మాత్రం మొదట్లో అనుకున్నంత స్థాయిలో అయితే ఓపెనింగ్స్ రాకపోవచ్చు.

ఇక ఈ సినిమా కు సంబంధించిన లోకేష్ మల్టీవర్స్ లింకులపై ఎడతెరిపి లేకుండా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. లోకేష్ గత సినిమాల కథలకు లియోకు సంబంధం ఉంటుంది అనే విషయంలో ఫ్యాన్స్ చాలా రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో కొన్ని షాట్స్ చూసి విక్రమ్ సినిమాకు లింకు ఉంది అని చెప్పేస్తున్నారు.

అయితే ఇందులో కమల్ హాసన్ ప్రస్తావన కూడా ఉంటుందని ఒక టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్ ఇందులో కనిపిస్తారా లేదా అనే విషయం కంటే కూడా ఆయన వాయిస్ ఓవర్ ఒక దగ్గర ఉంటుంది అని అది సినిమాకు చాలా హైలైట్ గా ఉంటుంది అని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి గాసిప్స్ ఎంత వేడెక్కుతున్నా కూడా లోకేష్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే అని అన్ని విషయాలు రిలీజ్ రోజే తెలుస్తాయని చెబుతున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు మాత్రం మళ్లీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకు లోకేష్ ప్రెస్ మీట్ తో తప్ప మరి ఏ విధమైన ప్రమోషన్స్ చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. హీరో విజయ్ సొంత భాషలోనే అంతంత మాత్రమే ప్రమోషన్ చేస్తాడు. కాబట్టి తెలుగులో ఈవెంట్ నిర్వహించిన కూడా రాకపోవచ్చు. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.

Tags:    

Similar News