దుల్కర్ 'లక్కీ' ఫ్యామిలీ పిక్

ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్ చేస్తున్నారు.

Update: 2024-09-07 09:26 GMT

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటు టాలీవుడ్ లో.. అటు మాలీవుడ్ లో వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగులో ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్.. తన కంటూ బిగ్ మార్కెట్ ను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్ చేస్తున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై ఆడియన్స్ లో ఆసక్తి రేపాయి. దీంతో లక్కీ భాస్కర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడే రిలీజ్ కావాల్సిన ఆ మూవీని కొన్ని కారణాల వల్ల మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

త్వరలో రిలీజ్ కానున్న లక్కీ భాస్కర్ మేకర్స్ నేడు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా బ్యూటిఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గణపయ్య మీ అందరికీ అదృష్టాన్ని, ఆర్థిక సమృద్ధి ప్రసాదించాలని లక్కీ భాస్కర్ టీమ్ కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. అయితే కొత్త పోస్టర్ సూపర్ గా ఉంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరీ తమ బాబును ఎత్తుకుని ఉన్న పిక్ అదిరిపోయింది.

ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలోని దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ ఫోటో చూడముచ్చటగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. పండుగకు తగ్గట్టు మేకర్స్ పెర్ఫెక్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారని చెబుతున్నారు. లక్కీ భాస్కర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై గ్రాండ్ గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

1980- 90 బ్యాక్ డ్రాప్ లో ఓ బ్యాంక్‌ క్యాషీయర్‌ అసాధారణ ప్రయాణ నేపథ్యంతో రూపొందుతున్న లక్కీ భాస్కర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే సెప్టెంబర్ 7వ తేదీన మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కిస్తున్నామని, అందుకే దీపావళికి వాయిదా వేస్తున్నామని చెప్పారు. మరి అక్టోబర్ 31న రిలీజ్ కానున్న లక్కీ భాస్కర్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News