వస్తాడనుకుంటే వాయిదా వేసిన భాస్కర్!
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో `లక్కీ భాస్కర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో `లక్కీ భాస్కర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దుల్కర్ సాప్ట్ ఇమేజ్ ని బేస్ చేసుకుని అంతే సాప్ట్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలున్నాయి. తొలిసారి కలిసి పనిచేస్తున్నా? ఇద్దరి స్వభావాలు ఒకేలా ఉంటాయి అన్న అంశం ఈ అంచనాలకు కారణమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
వినాయక చవితి వీకెండ్ సందర్భంగా సెప్టెంబర్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటిం చారు. దీంతో అభిమానులంతా ఆ డేట్ కి సిద్దమవుతున్నారు. ఇంతలోనే మేకర్స్ షాక్ ఇచ్చారు. సినిమా సెప్టెంబర్ నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా `లక్కీ బాస్కర్` సెప్టెంబర్ తేదీని వెనక్కి తీసుకున్నారు. దీంతో కొత్త రిలీజ్ తేదీపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
అయితే మేకర్స్ అక్టోబర్ లేదా? నవంబర్ లో రిలీజ్ అయ్యేలా కొత్త తేదీని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అప్పటికి నిర్మాణానంతర పనులు పూర్తయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సెప్టెంబర్ 5న మాత్రం విజయ్ `ది గోట్` తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా తప్ప ఇంకే సినిమాలు రిలీజ్ కి లేవు. నిజానికి లక్కీ భాస్కర్ రిలీజ్ కి సెప్టెంబర్ సరైన రిలీజ్ సమయం.
పెద్ద సినిమాలేవి కూడా రిలీజ్ కి లేవు. వినాయక చవితి సెలవులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకునే సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకున్నారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగవు కదా. `సీతారామం` విజయంతో దుల్కర్ తెలుగింట బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.