సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్.. మనసును హత్తుకునేలా!

అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వ‌హిస్తున్న ఆ సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తున్నారు.

Update: 2024-10-05 14:41 GMT

వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే పంథాలో వెళుతున్న ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024లో ఇప్పటికే హరోం హర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ థియేటర్లలో సందడి చేయనున్నారు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వ‌హిస్తున్న ఆ సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి వ్యూస్ అందుకుంటున్న ట్రైలర్.. టీజర్ కు మించిన ఎమోషన్స్ తో నిండిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. మనసును హత్తుకునేలా ఉందని అంటున్నారు.

"ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ 25 సంవత్సరాలు" అంటూ సాయి చంద్ చెప్పిన డైలాగ్‌‌ ‌తో ట్రైలర్ ప్రారంభమైంది. అయితే డ‌బ్బు కోసం పుట్టగానే తన కొడుకు (సుధీర్ బాబు)ను తండ్రి (సాయి చంద్) అమ్ముకుంటాడు. ఆ తర్వాత జ‌న్మ ఇవ్వ‌లేక‌పోయినా సుధీర్ బాబును త‌న కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. ఆయన ఓ విషయంలో అతడు జైలు పాలవుతాడు. అప్పుడే కొడుకు కోసం 25 ఏళ్ల త‌ర్వాత సాయి చంద్ వస్తాడు.

అయితే తన కన్న తండ్రి వచ్చాక సుధీర్ బాబు పరిస్థితి ఏంటి? పెంచిన తండ్రి జైలు పాలవ్వడంతో హీరో ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడా? అన్న విషయాల కోసం మొత్తం సినిమా చూడాల్సిందే. ట్రైలర్ లో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. సుధీర్ బాబుతో పాటు ఆయన తండ్రులుగా నటించిన షాయాజీ షిండే, సాయి చంద్ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చివర్లో హీరో మహేష్ బాబు రిఫరెన్స్ కూడా యాడ్ చేయడం కాస్త స్పెషల్ గా ఉంది.

మొత్తంగా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై హోప్స్ పెంచుతోంది. అయితే తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ తో మూవీ రాబోతుండగా.. సుధీర్ బాబు పక్కాగా హిట్ కొట్టబోతున్నారని అంతా అంచనా వేస్తున్నారు. సీఏఎమ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ తో కలిసి వీ సెల్యులాయిడ్స్‌ బ్యానర్ పై సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. రాజు సుందరం, శశాంక్, ఆమని, అనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి మా నాన్న సూపర్ హీరో మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News