డబుల్ ఇస్మార్ట్.. మార్ ముంతా చోడ్ చింతా..
తాజాగా, ఈ చిత్రంలోని రెండవ సింగిల్ 'మార్ ముంతా చోడ్ చింతా' విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు హైదరాబాదీ స్లాంగ్ చక్కగా ఉపయోగించారు.
ఉస్తాద్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' అప్పట్లో ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్‌లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్' కూడా అదే రీతిలో హిట్ అవుతుందని అనిపిస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విడుదలకు ముందే పాటలు చార్ట్ బస్టర్లుగా నిలుస్తున్నాయి.
'డబుల్ ఇస్మార్ట్'లోని మొదటి సింగిల్ 'స్టెప్పా మార్' విడుదలైనప్పుడు సాలీడ్ రెస్పాన్స్ పొందింది. తాజాగా, ఈ చిత్రంలోని రెండవ సింగిల్ 'మార్ ముంతా చోడ్ చింతా' విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు హైదరాబాదీ స్లాంగ్ చక్కగా ఉపయోగించారు. ఈ దేశీ పార్టీ నెంబర్‌కు మనీ శర్మ సరికొత్త నేటివ్ ఫోక్ ఫ్లేవర్ ఇచ్చారు.
పాటలోని బీట్‌లు చాలా ఎనర్జెటిక్‌గా ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ సీపన, కీర్తన శర్మ త్రయం ఈ పాటకు గానం అంధించగా, వారి వాయిస్‌లు పాట ఎనర్జీకి అద్భుతంగా సరిపోయాయి. రామ్ పోతినేని ఎనర్జీ మరొక లెవెల్‌లో ఉంది. అతని డాన్స్‌లు చూస్తుంటే విజిల్స్ వేసేలా ఉంది. ఈసారి మరింత హై వోల్టేజ్ వైబ్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది.
ఇక కవ్యా థాపర్ రామ్‌తో కలిసి చిందులు వేసిన విధానం పాటకు గ్లామర్ ను తెచ్చాయి. ఈ పాట చక్కగా సెట్‌లపై చిత్తురించారు. ఈ పాట మాస్ పార్టీలలో ప్రధాన ఎంపికగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మాణంలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కవ్యా థాపర్ రామ్ కు జోడీగా నటిస్తున్నారు.
శ్యామ్ కె నాయుడు మరియు జియానీ జియానెల్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 15 న విడుదల కానుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్, కవ్యా థాపర్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు నటిస్తుండటంతో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. 'మార్ ముంతా చోద్ చింతా' పాటతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.