సముద్రంలో సొంత పడవ...విహరిస్తూ అదే పనా?
సెలబ్రిటీలందరికీ సొంతంగా విమానాలున్నాయి..చార్టెట్ ప్లైట్ లు..హెలికాప్టర్లు ఇలా గాల్లోకి ఎగిరే వాహనాలు చాలా మందికి ఉన్నాయి.
సెలబ్రిటీలందరికీ సొంతంగా విమానాలున్నాయి..చార్టెట్ ప్లైట్ లు..హెలికాప్టర్లు ఇలా గాల్లోకి ఎగిరే వాహనాలు చాలా మందికి ఉన్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి వారి లైఫ్ స్టైల్ కి తగ్గట్టు వాటిని మెయింటెన్ చేస్తున్నారు. ఇంకా కోట్ల రూపాయల ఖరీదుగల లగ్జరీ కార్లున్న వాళ్లను చూసాం. కానీ సొంతంగా ఓ సముద్రంలో విహరించే యాచ్ ( బోట్..పొడవైన పెద్దదైన పడవ) కలిగిన వారు ఎవరైనా? ఉన్నారా? అంటే పెద్దగా ఎవరూ కనిపించరు.
సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడే వారు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సొంతంగా యాచ్ ల్ని కొనుగోలు చేసి మెయింటెన్ చేయరు. కావాలంటే విదేశాలు వెళ్లి రెండు..మూడు రోజులు బోట్ లో రేయింబవళ్లు విహరించి వస్తారు గానీ..సొంతంగా కొనేంత సాహసం ఎవరూ చేయరు. కానీ నటుడు మాధవన్ మాత్రం సొంతంగా ఓ యాచ్ ని కలిగి ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అతడి దగ్గర డబ్బున్నంత మాత్రాన ఇది కాళ్లదగ్గరకి వచ్చేసింది అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈ యాచ్ లు కొనాలంటే వాళ్లకు కొన్ని రకాల అర్హతలు సాధించాల్సి ఉంటుంది. ఓడ కొనాలంటే కెప్టెన్ లైసెన్స్ ఉండాలి. దాన్ని మ్యాడీ కరోనా సమయంలో సాధించినట్లు తెలిపాడు. అప్పుడు ఖాళీ సమయం దొరకడంతో ఆ పరీక్షకు సిద్దమై రాసి పాసయ్యాడు. ఆ ప్రాసస్ అంతా పూర్తి కావడానికి ఆరు నెలలు సమయం పట్టిందిట.
ఇప్పుడు 40 అడుగులు ఎత్తున్న పడవను సునాయాసంగా నడపగలను అంటున్నాడు. ఇప్పుడా యాచ్ ని నడుపుతుంటే భలే మజా ఉంటుందంటున్నాడు. అందులో కూర్చుని..ప్రయాణం చేస్తూ కథలు కూడా రాస్తున్నాడుట. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సముద్రంలోకి వెళ్లిపోవడం...భూ ప్రపంచం నుంచి దూరంగా నీటిలో ఉండటం ఓ కొత్త అనుభూతిని అందిస్తుందన్నాడు.
ప్రయాణ మధ్యలో డాల్పిన్స్ గాలిలోకి పైకి ఎగురుతుంటే మరింత కిక్ వస్తుందన్నాడు. జీవితంలో ఈ పడవ కొనడం అన్నది తాను తీసుకున్న గొప్ప నిర్ణయంగా చెప్పుకొచ్చాడు. మరి ఈ యాచ్ ధర ఎంతో తెలుసా? నాలుగు కోట్ల నుంచి 16 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ యాచ్ దుబాయ్ లో ఉంచాడుట.