త్రిషపై కామెంట్స్ కోర్ట్ తీర్పు ఇదే.. మన్సూర్ కి చురకలంటించిన కోర్టు..!
లియో సినిమా తర్వాత అందులో నటించిన మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై రే**ప్ సీన్ ఉంటుందని అనుకున్నా కానీ అది లేదని తెలిసి బాధేసిందంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
లియో సినిమా తర్వాత అందులో నటించిన మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై రే**ప్ సీన్ ఉంటుందని అనుకున్నా కానీ అది లేదని తెలిసి బాధేసిందంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష కూడా సీరియస్ అయ్యింది. త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ పై చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి లాంటి సెలబ్రిటీలు స్పందించారు. త్రిషకు మద్దతుగా నిలిచి మన్సూర్ పై ఫైర్ అయ్యారు.
ఈ విషయంలో తనని కామెంట్ చేసిన వారి మీద పరువు నష్టం దావా వేశాడు మన్సూర్. తను క్యాజువల్ గా అన్న మాటలను వారు సీరియస్ గా తీసుకున్నారని ఈ వ్యవహారంలో తాను ఇన్నోసెంట్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. చిరంజీవి, త్రిష, ఖుష్భు లపై కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై శుక్రవారం విచారణ నిర్వహించారు.
నటిపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు గాను స్పందనగా ముగ్గురు నటులు ఆమెకు మద్ధతిచ్చారు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా సరే అలానే రెస్పాండ్ అవుతారు. ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని కోర్ట్ చెప్పింది. ఇదంతా మన్సూర్ పబ్లిసిటీ కోసం చేసినట్టుగానే ఉందని కోర్టు తీర్పు ఇస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీష్ కుమార్ ఆ పిటీషన్ ను కొట్టేశారు.
అంతేకాదు కోర్టు సమయం వృధా చేసినందుకు గాను మన్సూర్ కే అదనంగా లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెల్లించాలని ఆదేశించింది. తప్పని తెలిసినా ఏదో సాధిద్దాం అని కోర్టు దాకా వెళ్తే అక్కడైనా పడాల్సిన మొట్టికాయలు పడతాయని మన్సూర్ కి ఈ తీర్పుతో అర్ధమవుతుంది. పొరపాటున కామెంట్ చేసినా మ్యాటర్ పెద్దదవుతుందని తెలిసినా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. సో ఈ తీర్పు వల్ల హీరోయిన్స్ ని కామెంట్ చేసేందుకు మరికొందరు వెనక్కి తగ్గుతారని చెప్పొచ్చు.