ఫుల్ క్లారిటీతో మ‌హేష్ రంగంలోకి!

ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. అప్ప‌టి నుంచి మ‌హేష్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉంటుంది.

Update: 2024-11-29 14:30 GMT

ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. అప్ప‌టి నుంచి మ‌హేష్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉంటుంది. పూర్తిగా రాజ‌మౌళి అండ్ కోతోనే స‌మ‌యాన్ని గ‌డ‌పాల్సి ఉంటుంది. కుటుంబానికి కూడా ఎక్కువ స‌మ‌యం ఇచ్చే ఛాన్స్ లేదు. రాజ‌మౌళి సెల‌వులిస్తే త‌ప్ప ఫ్యామిలీకి కూడా స‌మ‌యం ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉండొచ్చు. మ‌రి రాజ‌మౌళి సినిమా త‌ర్వాత కూడా మ‌హేష్ అంతే బిజీగా ఉంటాడా? రీజ‌న‌ల్ మార్కెట్ ని వ‌దిలేసి పాన్ ఇండియా...పాన్ వ‌ర‌ల్డ్ అంటూ ప‌రుగులు తీసే అవ‌కాశం ఉందా? అంటే అందుకు ఛాన్సెస్ ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.

ఇంత వ‌ర‌కూ మ‌హేష్ పాన్ ఇండియా సినిమా చేయ‌లేదు. కేవ‌లం రీజ‌నల్ తెలుగు మార్కెట్ ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసారు. సొంతింటి క‌థ‌ల‌తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. కానీ రాజ‌మౌళి సినిమా త‌ర్వాత స‌న్నివేశం అలా ఉండ‌దు. ప్ర‌తీ సినిమా పాన్ ఇండియాలోనే ఉండేలా కెరీర్ ని ప్లాన్ చేసుకోవ‌చ్చు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ లు అలా ప్లాన్ చేసుకునే ముందుకెళ్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత చ‌ర‌ణ్ శంక‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్ చేసాడు.

ఇది వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇక తార‌క్ కొర‌టాల‌తో `దేవ‌ర` చేసాడు. ఇది పాన్ ఇండియా రిలీజ్. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ తో క‌లిసి `వార్ -2`లో న‌టిస్తున్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. `బాహుబ‌లి` నుంచి ప్ర‌భాస్ కూడా ఇదే స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్నాడు. అయితే వీరంతా హిందీలో కూడా సినిమాలు చేసిన వాళ్లు. కానీ మ‌హేష్ అందుకు భిన్నంగా తాను సృష్టించాలి అనుకుంటోన్న సంచ‌ల‌నాల‌న్నీ టాలీవుడ్ లో ఉండే క్రియేట్ చేస్తారు. ప్ర‌త్యేకంగా ముంబైకి వెళ్లి హిందీ సినిమాలైతే చేయ‌న‌ని మ‌హేష్ కొన్నేళ్ల క్రిత‌మే కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అత‌డు పాన్ ఇండియా సినిమా అయినా...పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అయినా అది టాలీవుడ్ నుంచే ఉండొచ్చు.

Tags:    

Similar News