ఎస్ ఎస్ ఎంబీ 29 లో ఇదంతా నిజ‌మేనా?

#ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ పై కొన్నికీల‌క స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు.

Update: 2025-02-09 07:09 GMT

#ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ పై కొన్నికీల‌క స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. దీన్నిఓ చిన్న షెడ్యూల్ గా ప్లాన్ చేసి ముందుకెళ్లారు. ప్రస్త‌తుం అల్యుమి నియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుగుతోంది. అదే స్పాట్ లో వ‌ర్క్ షాప్ కూడా రాజ‌మౌళి నిర్వ‌హిస్తున్నారు. మ‌హేష్‌, ప్రియాంక చోప్రాల‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌పై ప్రీ వర్క్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ప్రియాంక చోప్రా అంటే గ్లోబ‌ల్ స్థాయిలో పేరున్న న‌టి. ఆమెతో కాంబినేష‌న్ స‌న్నివేశాలంటే ఎంతో జాగ్ర‌త్త‌గా చిత్రీక రించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి ఆ స‌న్నివేశాల‌కు సంబంధించి ఎక్కువ‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా సినిమాలో జాన్ అబ్ర‌హం ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఓ ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో జాన్ రోల్ డిజైన్ చేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అలాగే మ‌రో బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ని కూడా కీల‌క పాత్ర‌కు తీసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అది కీల‌క పాత్ర‌? మ‌హేష్ కి తండ్రి పాత్ర పోషిస్తున్నాడా? అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇప్ప‌టికే కొన్ని పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. తొలుత ‘మహారాజ్’, ‘గరుడ’ లాంటి పేర్లు వినిపించాయి. తాజాగా వాటి స‌ర‌స‌న మ‌రో కొత్త టైటిల్ చేరింది. రాజ‌మౌళి పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తోన్న సినిమా కావ‌డంతో? 'జ‌న‌రేష‌న్' అనే మ‌రో ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప‌రిశీల‌నలో ఉన్న‌ట్లు వినిపిస్తుంది.

స్టోరీ కార్సెప్ట్ ఆధారంగా జ‌న‌రేష‌న్ ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని యూనిట్ భావిస్తోందిట‌. ఇప్ప‌టికే సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంద‌నే ప్ర‌చారంలో ఉంది. `జ‌న‌రేష‌న్` తో మ‌రో స‌బ్ టైటిల్ కూడా జోడించి మొద‌టి భాగాని రిలీజ్ చేస్తార‌ని...రెండవ భాగానికి మ‌రో స‌బ్ టైటిల్ యాడ్ అవుతుంద‌ని అంటున్నారు.

అలాగే సినిమాలో హై ఎండ్ విజువ‌ల్ ఎఫెక్స్ట్ ఉంటాయ‌ని, వాటి కోసం హాలీవుడ్ టెక్నిక‌ల్ బృందం ప‌ని చేస్తుంద‌ని తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. రాజ‌మౌళి రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని అందుకోవాలంటే? హాలీవుడ్ టెక్నిషియన్లతో మాత్రమే సాధ్య‌మ‌వుతుంద‌ని...అందుకోసం సినిమాలో మేజ‌ర్ పార్ట్ వాళ్ల‌దే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

Tags:    

Similar News