రాజమౌళి - మహేష్.. అసలు రచ్చ అప్పుడే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో నెవ్వర్ బిఫోర్ అనే మాస్ క్యారెక్టర్ తో వచ్చాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో నెవ్వర్ బిఫోర్ అనే మాస్ క్యారెక్టర్ తో వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఫీషియల్ గా చెప్పుకోయినా ప్రాజెక్టు కు సంబంధించిన గాసిప్స్ గట్టిగానే వస్తిన్నాయి. ఇక అఫీషియల్ అప్డేట్ కు ఓ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట.
సమ్మర్లో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న సినిమా అఫీషియల్ ప్రకటన తో రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే SSMB29 అసలు రచ్చ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే.
ఇక ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఉంటుందని, ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వినిపించాయి. రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఈ సినిమా కథాంశం ఇండియానా జోన్స్ సిరీస్ ని పోలి ఉంటుందని అన్నారు. ఈ చిత్రం 'రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్' (1981) తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచరస్, యాక్షన్ డ్రామాగా ఉంటుందని, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రతీ సినిమాకు కూడా షూటింగ్ కంటే ముందే వర్క్ షాప్ ఉంటుంది. ఈ సినిమాకు కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.