మహేష్ లైనప్.. రాజమౌళి తరువాత ఎవరెవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ కోసం రెడీ అవుతున్నారు.

Update: 2024-09-12 03:55 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ కోసం రెడీ అవుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న సిద్ధం అవుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపొయింది. కానీ ఈ సినిమా అప్డేట్ ఏంటనేది ఎవరికి తెలియదు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

మీడియాలో రకరకాల కథనాలు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి. వేటిలో కూడా స్పష్టత లేదు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి కనీసం 2 నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తరువాత ఇతర దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైన్ అప్ లో ముగ్గురు స్టార్ దర్శకులు ఉన్నారు. రాజమౌళితో SSMB29 చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో SSMB30 సినిమాని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB31 సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో త్రివిక్రమ్ మహేష్ బాబుకి సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఆయన సక్సెస్ లపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దీంతో కొరటాలతో SSMB32 మూవీ చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగానే ఉన్నారంట. అయితే దేవర సిరీస్ సక్సెస్ బట్టి కొరటాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు నిర్ణయం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ ప్లానింగ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే సరిపోయే కథ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో మూవీస్ చేయాలంటే నెక్స్ట్ వీరు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకుంటేనే సాధ్యం అవుతుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News