ధమ్ మసాలా.. సరిపోలేదు గురూజీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం.

Update: 2023-11-12 06:21 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా నుంచి రీసెంట్ గా దమ్ మసాలా అంటూ సాగే ఒక పాటని ఫస్ట్ సింగిల్ గా తీసుకొచ్చారు. ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ వ్యూస్ ని ఒక్కరోజులోనే సాధించింది. దీనిని బట్టి గుంటూరు కారం సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో ఆల్బమ్ సాంగ్స్ అన్ని పెద్ద హిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ తర్వాత కూడా ట్రెండ్ సెట్ చేశాయి. పుష్ప సాంగ్స్ వచ్చే వరకు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సాంగ్స్ హవానే సోషల్ మీడియాలో నడిచింది. అంతగా జనాల్లోకి ఆ సాంగ్స్ వెళ్ళిపోయాయి.

గుంటూరు కారం నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ దమ్ మసాలా సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కి భాగా కనెక్ట్ అయిన కూడా మొదటి రోజు ఉన్నంత స్పీడ్ సెకండ్ డే నుంచి లేదు. స్పీడ్ తగ్గిపోయింది. దీనికి కారణం ఈ సాంగ్ డ్యూయెట్, డాన్స్ ఎలివేషన్ ఉండే సాంగ్ కాకపోవడమే. సిట్యువేషన్ లిరిక్స్ కూడా కాదు. కేవలం హీరో ఎలివేషన్ మీద నడిచే సాంగ్. ఈ కారణంగానే సాంగ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

అయితే ఫ్యాన్స్ మాత్రం సాంగ్ విషయంలో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కాని సోషల్ మీడియాలో యధావిధిగా ధూమ్ మా చాలే సాంగ్ ట్యూన్ కాపీ చేసి తమన్ ఈ పాటని చేశాడంటూ అతని వ్యతిరేకులు త్రోల్ చేస్తున్నారు. హీరోకి, దర్శకుడికి నచ్చినపుడు నెటిజన్లు ట్రోల్ తో పెద్దగా పని ఉండదు. ఇదే డేరింగ్ తో తమన్ తమ మ్యూజిక్ జర్నీని కొనసాగిస్తూ అవకాశాలు అందుకుంటున్నారు.

అయితే సాంగ్ బట్టి ఒక్కటి మాత్రం జనాల్లోకి బలంగా వెళ్ళింది. గుంటూరు కారం ఇప్పటి వరకు వచ్చిన త్రివిక్రమ్ రెగ్యులర్ స్టైల్ మూవీలా కాకుండా కంప్లీట్ మాస్ కమర్షియల్ టచ్ లో ఉంటుందనే టాక్ భాగా రీచ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ తరహా కంప్లీట్ రస్టింగ్ స్టొరీతో మూవీ చేయలేదు. కాబట్టి అతనికి ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News