సంక్రాంతికి బాబు ఫిక్స్.. కోడి పందేనికి గుంటూరు కారం రెడీ..!

లుంగీతో మహేష్ బాబు అలా బీడీని వెలిగిస్తూ ఊర మాస్ అప్పీల్ తో కనిపిస్తున్నాడు.

Update: 2023-08-09 03:53 GMT

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మొదలైన నాటి నుంచి సినిమాపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే సినిమా యూనిట్ మాత్రం వాటి గురించి పట్టించుకోకుండా వెళ్తున్నారు. మహేష్ పర్సనల్ రీజన్స్ వల్ల గుంటూరు కారం సినిమాను షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో ముందు పూజా హెగ్దే, శ్రీ లీల హీరోయిన్స్ గా తీసుకోగా పూజా ఎగ్జిట్ అయ్యి శ్రీ లీల, మీనాక్షి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


నేడు సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం నుంచి ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. లుంగీతో మహేష్ బాబు అలా బీడీని వెలిగిస్తూ ఊర మాస్ అప్పీల్ తో కనిపిస్తున్నాడు. మహేష్ ని ఇంత మాస్ యాంగిల్ లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చెప్పొచ్చు. మహేష్ లాంటి క్లాస్ హీరో ఎప్పుడూ తన ఇమేజ్ కి తగిన పాత్రలనే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా శ్రీమంతుడు తర్వాత ఒకే రకమైన క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. అయితే ఆ సినిమాలు హిట్ అవుతున్నా కూడా ఫ్యాన్స్ లో ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉంది.

ఆ ఆకలి తీర్చేలా గుంటూరు కారం రాబోతుంది. త్రివిక్రం మహేష్ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. అతడు క్లాసికల్ హిట్ అందుకోగా ఖలేజా థియేటర్ లో ఆడలేదు కానీ బుల్లితెర మీద హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా వస్తున్న గుంటూరు కారం సినిమా మాత్రం టార్గెట్ అసలు మిస్ అవదని అంటున్నారు. గుంటూరు కారం షూటింగ్ పోస్ట్ పోన్ కారణంగా సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా రాదా అన్న డౌట్ మొదలైంది.

గుంటూరు కారం సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే ఈమధ్య సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలు రాగా లేటెస్ట్ గా బర్త్ డే పోస్టర్ లో మరోసారి సంక్రాంతి పోటీకి సిద్ధం అని చెబుతూ డేట్ మరోసారి అనౌన్స్ చేశారు. సో గుంటూరు కారం సంక్రాంతి పందెం కోడిగా రాబోతుంది అన్నది మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు. అయితే సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ప్రభాస్ కల్కి వాయిదా పడే ఛాన్స్ ఉంది. రవితేజ ఈగల్ ఇప్పటికే పొంగల్ రిలీజ్ ఫిక్స్ చేసుకోగా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఓజీ కానీ సంక్రాంతి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News