మహేష్ ఫ్లాప్ మూవీ.. హిట్ అయ్యే ఛాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మహేష్ బాబు సినిమాలో ఉన్నాడంటే అతని ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటారు. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో అతడు థియేటర్స్ లో కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. తరువాత టీవీలలో మూవీకి అద్భుతమైన ఆదరణ లభించింది. మహేష్ బాబు ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో అతడు కూడా ఒకటిగా చెబుతారు. అంతలా అతడు సినిమాకి గుర్తింపు లభించింది.
తరువాత ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా మూవీ కూడా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. మహేష్ బాబు అభిమానులు కూడా ఆ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యారు. అయితే తరువాత ఖలేజా స్టోరీ థీమ్ అర్ధం చేసుకున్నాక ప్రేక్షకులు మూవీని ఆదరించడం మొదలుపెట్టారు. చిన్న చిన్న లోపాలు ఉన్న ఆ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఖలేజా వరకు మహేష్ బాబుని సీరియస్ క్యారెక్టర్స్ లోనే ప్రేక్షకులు చూసేవారు.
మొదటిసారి ఫుల్ లెంత్ లో వినోదం పండించేసరికి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. మహేష్ బాబు బెస్ట్ మూవీస్ లో ఖలేజా ఒకటని చూపిస్తారు. ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి సౌత్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి సినిమాలని మరల రీరిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ముందు ఫ్యాన్స్ షోలుగా ప్రారంభమైన ఈ ట్రెండ్ తరువాత హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా అన్నింటికి వర్తించింది.
ఆరెంజ్ లాంటి ఫ్లాప్ సినిమాకి ఆదరణ లభించింది. అలాగే డబ్బింగ్ సినిమాలని కూడా మళ్ళీ ప్రేక్షకులు థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడ్డారు. ఖలేజాని మళ్ళీ థియేటర్స్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. కచ్చితంగా ఈ మూవీ రీరిలీజ్ అయితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుందనే మాట వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఖలేజా రీరిలీజ్ అయితే చూడాలని కోరుకుంటున్నారు.
అయితే ఖలేజా రీరిలీజ్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు పోకిరి, ఒక్కడు సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖలేజా కూడా రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది అఫీషియల్ గా ప్రకటించే వరకు తెలియదు.