SSMB29: ఎన్నో ఏళ్ళ తర్వాత అలాంటి లోకేషన్స్ కు మహేశ్!

మహేష్ మూవీ లోకేషన్స్ ఫైనలైజ్ చేయడానికి రాజమౌళి తన టీమ్ తో కలిసి సౌతాఫ్రికా వెళ్లనున్నారు.

Update: 2024-08-10 03:45 GMT
SSMB29: ఎన్నో ఏళ్ళ తర్వాత అలాంటి లోకేషన్స్ కు మహేశ్!
  • whatsapp icon

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB29 సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడతో అందరూ నిరాశ చెందారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మహేష్ మూవీ లోకేషన్స్ ఫైనలైజ్ చేయడానికి రాజమౌళి తన టీమ్ తో కలిసి సౌతాఫ్రికా వెళ్లనున్నారు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో కొన్ని దట్టమైన అడవుల్లో దర్శకుడు తన బృందంతో కలిసి రెక్కీ నిర్వహించనున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకముందెన్నడూ చూడని సరికొత్త లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో మహేశ్ బాబు సినిమాలన్నీ ఎక్కువగా స్టూడియోల్లో స్పెషల్ గా నిర్మించే సెట్స్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ 7 ఎకరాలు లేదా హైదరాబాద్ శివార్లో భారీ సెట్లు వేసి అక్కడే దాదాపు సినిమా అంతా పూర్తి చేస్తున్నారు. పాటల కోసం ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు తప్పితే, మహేశ్ రియల్ లోకేషన్స్ లో, ఔట్ డోర్ షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపించరనే టాక్ ఉంది.

కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలో అలా కుదరకపోవచ్చు. ఫారెస్ట్ అడ్వెంచర్ అని చెబుతున్నారు కనుక, చాలా వరకు రియల్ లోకేషన్స్ లోనే చిత్రీకరణ జరుపుకునే అవకాశం ఉంది. అందుకే జక్కన్న అండ్ టీమ్ లోకేషన్స్ కోసం ఆఫ్రికన్ కంట్రీస్ కు బయలుదేరుతున్నారు. సో మహేశ్ బాబు ఈసారి గతంలో కంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. దీని కోసం ఆయన ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

మహేష్ బాబు ఈ సినిమాలో బెస్ట్ లుక్ లో కనిపించనున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో కనిపిస్తారు. మరోవైపు ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మెయిన్ విలన్ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ హీరో విక్రమ్, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ మేకర్స్ దీనిపై స్పందించలేదు.

SSMB29 చిత్రాన్ని ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ లో ప్రారంభిస్తామని నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకాస్త టైం పట్టొచ్చని, షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావచ్చనే మాట వినబడుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News