మహేష్ కి రాజమౌళి 3 నెలలు ఛాన్స్ ఇస్తాడా..?
అందుకు జక్కన్న ఓకే అంటే ఈ 3 ఏళ్లలో మహేష్ కనీసం రెండు సినిమాలైనా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలాగు రాజమౌళి సినిమా 2027 లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రాజమౌళి సినిమా అంటే సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరు వారి బల్క్ డేట్స్ ఇవ్వాల్సిందే. అన్ని సినిమాల్లాగా కొద్దిరోజులు ఇక్కడ మరికొద్ది రోజులు అక్కడ పనిచేస్తానంటే కుదరదు. కంప్లీట్ గా సినిమా ఓకే అనుకున్నాక వర్క్ షాప్ నుంచి రిలీజ్ వరకు తన సమక్షంలోనే ఉండాలి. కాదు కూడదు అంటే మళ్లీ రాజమౌళితో సినిమా చేసే అవకాశమే ఉండదు. అందుకే జక్కన్న సినిమా కోసం పనిచేస్తున్నామంటే నటీనటులు, టెక్నిషియన్లు వేరే సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వరు. అయితే ఎంత టైం తీసుకున్నా ఎంత కష్టపడినా దానికి రెండు మూడింతలు ఎక్కువ క్రేజ్ వస్తుంది అది తెలిసిన విషయమే.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమాకు కూడా కనీసం రెండు మూడేళ్లు టైం తీసుకునేలా ఉన్నాడు. ఈ సినిమాను కూడా రాజమౌళి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కేవలం ఒకే సినిమాకు 3 ఏళ్లు అంటే కష్టం అని మహేష్ ఆలోచిస్తున్నాడట. ఏడాదికి 6 నుంచి 7 నెలలు రాజమౌళి సినిమాకు మరో నెల రెండు నెలలు వెకేషన్ మరో 3 నెలలు మరో సినిమా చేసేలా రాజమౌళితో చర్చలు జర్పుతున్నాడట మహేష్.
అందుకు జక్కన్న ఓకే అంటే ఈ 3 ఏళ్లలో మహేష్ కనీసం రెండు సినిమాలైనా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలాగు రాజమౌళి సినిమా 2027 లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మహేష్ కోసం రాజమౌళి తన కండిషన్స్ ని సడలిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి కాదంటే మాత్రం మహేష్ కూడా తన వేరే సినిమా ప్రయత్నాలను ఆపేసుకోవాలనే చూస్తున్నాడు.
మహేష్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళితో సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో రికార్డులు కొట్టడం వరకు ఓకే కానీ సినిమా కోసం మరీ 3 ఏళ్ల టైం అంటే చాలా కష్టమని భావిస్తున్నారు. రాజమౌళి మహేష్ ఈ కాంబో సినిమాపై వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి ఈసారి మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ముందే అంతా ప్రిపేర్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాలని చూస్తున్నాడు. ఎలా లేదన్నా మహేష్ 29వ సినిమాకు రెండేళ్ల టైం అయితే కచ్చితంగా పడుతుందని చెబుతున్నారు. మరి SSMB 29 నెక్స్ట్ అఫీషియల్ అప్డేట్ ఏంటన్నది చిత్ర యూనిట్ చెప్పాల్సి ఉంది.