సూపర్ స్టార్ ట్యాగ్ మారబోతుందా..?

ఇక మహేష్ ని ఇప్పటివరకు చేసిన 28 సినిమాలు ఒక లెక్క అయితే చేయబోయే సినిమా మరో లెక్క అనేలా ప్లాన్ చేస్తున్నారు.

Update: 2024-07-27 09:30 GMT

పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలను నిలబెట్టిన రాజమౌళి తన నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ సినిమాలే అన్నట్టుగా పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో చేస్తున్న సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచే సినిమా అప్పీల్ ఒక రేంజ్ లో ఉండబోతుందని టాక్. ఇక మహేష్ ని ఇప్పటివరకు చేసిన 28 సినిమాలు ఒక లెక్క అయితే చేయబోయే సినిమా మరో లెక్క అనేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మహేష్ మేకోవర్ సినిమాపై భారీ హైప్ తెస్తుండగా సినిమా బజెట్ 1000 కోట్లు అంటూ ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్నారు. రాజమౌళి మహేష్ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే జస్ట్ గోల్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అనగానే సినిమా గురించి నేషనల్ వైడ్ గా హంగామా చేశారు. సౌత్ లోనే కాదు రాజమౌళి మహేష్ చేసే సినిమా గురించి నేషనల్ వైడ్ గా కూడా భరీ చర్చలు చేస్తున్నారు.

ఐతే మహేష్ రాజమౌళి సినిమాలు గోల్డ్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయితే మాత్ర్మ్ ఈ కాంబోకి పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. ఐతే ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ మార్చి గోల్డ్ స్టార్ అని ఇంటర్నేషనల్ లెవెల్ లో మహేష్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. RRR తర్వాత చరణ్ కి గ్లోబల్ స్టార్, ఎన్టీఆర్ కు మాన్ ఆఫ్ మాసెస్ అఏ ట్యాగ్ ఇచ్చారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కి కూడా సూపర్ స్టార్ అన్నది మార్చి గోల్డ్ స్టార్ అని పెట్టేస్తారేమో చూడాలి.

ఈ సినిమా గురించి స్పెషల్ అప్డేట్ మహేష్ బర్త్ డే రోజు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇప్పటివరకు ఏ సినిమాకు చేయని హోం వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయలేదు. అంతేకాదు కేవలం తెలుగు సినిమాలతోనే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ టైం జక్కన్నతో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలకు కేంద్రంగా మారుతుందో చూడాలి. ముఖ్యంగా మహేష్ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి క్రేజీ కాంబినేషన్స్ బయట వినిపిస్తున్నాయి. అవేంటి అన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News