మహేష్ కూడా ఆ టైమ్ లో రెమ్యునరేషన్ తగ్గించి..

పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

Update: 2024-04-03 04:17 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఏవరేజ్ టాక్ తో బయటపడింది. ఇప్పుడు సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు నటులని కూడా ఎంపిక చేసే పనిలో జక్కన్న ఉన్నారు. మరో వైపు సినిమాలో క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుని ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా చూస్తారని సినీ విశ్లేషకులు అంటున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 70కోట్లకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పదేళ్ళ క్రితం ఆ లెక్క 40 కోట్ల కంటే తక్కువే ఉండేది. అయితే ఏదైనా కథ మహేష్ బాబుకి బాగా నచ్చితే ఆ సినిమా బడ్జెట్ లెక్కలు ఎక్కువగా ఉంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి వెనుకాడరు. కొన్ని సినిమాలు రెమ్యునరేషన్ తీసుకోకుండా సహ నిర్మాతగా మారి లాభాల్లో వాటాలు తీసుకున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఫస్ట్ ఇద్దరు పెద్ద స్టార్స్ అయిన మహేష్ బాబు, వెంకటేష్ ఈ చిత్రంలో కలిసి నటించారు. మహేష్ బాబు హీరోగా మారిన తర్వాత చేసిన ఒకే ఒక్క మల్టీ స్టారర్ మూవీ ఇదే కావడం విశేషం.

రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ తీసుకుంటే ఈ సినిమా బడ్జెట్ లెక్క ఎక్కువ అయ్యిందంట. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారంట. తరువాత దిల్ రాజు అనుకున్న బడ్జెట్ లో మూవీ పూర్తి చేయగలిగారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అలాగే మహేష్ బాబు, వెంకటేష్ కి ఈ సినిమా కథ నచ్చడంతో రెమ్యునరేషన్ లు తగ్గించుకోవడం వలన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్ మూవీని ప్రేక్షకులు చూడగలిగారు.

Tags:    

Similar News