ఆయన తర్వాత బీహార్ నుంచి వచ్చినోడ్ని నేనే!
వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన నటుడు.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యాడు. నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన నటుడు. తెలుగులోనూ 'హ్యాపీ', 'కొమరం పులి' లాంటి చిత్రాల్లో నటించి ఇక్కడా బాగా సుపరిచితుడైన నటుడు. తాజాగా ఆయన బాలీవుడ్ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో బిహార్ నుంచి విజయవంతంగా రాణిస్తున్న నటుడు శత్రుజ్ఞు సిన్హా. ఆయన తర్వాత అదే రాష్ట్రం నుంచి వచ్చిన వాడిని నేను. ఓ పల్లెటూరి అబ్బాయి స్టార్ హీరోగా ఎదగడం ఇదే మొదటి సారి కావొచ్చు. జీవితంలో మనం కోరుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం. అప్పట్లో చాలా మంది యువకులు కంపర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పోరాడేంత ధైర్యం లేదు. కానీ ఆజోన్ నుంచి వస్తేనే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది.
నాలాగే ఎంతో మంది కోరికల్ని, ఆశయాల్ని జయించలేక వెనుకబడ్డారు. కానీ మనం కన్న కలల్ని ఎందుకు నిజం చేసుకోకూడదు. మీరు తెలివిగా, మొండిగా ధైర్యంగా ఉండాలి. నా లక్ష్యాల విషయంలో నేనెప్పుడు మొండిగానే ఉంటాను. ఒకవేళ అలా లేకపోతే పరిస్థితులు మమ్మల్ని ప్రతీ క్షణం సవాల్ చేస్తాయి. అలాంటి అనుభవాలు నేను ఎన్నో చూసాను. అందుకే కంపోర్ట్ జోన్ వదిలే విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా బయటకు వచ్చాను.
కాబట్టే సక్సెస్ అయ్యాను. ఫెయిలైతే నా జీవితం మరోలా ఉండేది. అలాగని మరీ అంత దారుణమైన జీవితాన్ని అయితే గడిపేవాణ్ణి కాదు కదా? యువత ఏ పనిచేయా లుకున్నా..జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్నా ఒక ఫేజ్ లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఛాన్స్ ఎవరూ మిస్ చేసుకోవద్దు' అని అన్నారు.