గేమ్ చేంజర్‌ 'నానా హైరానా' - ఇది అసలు మ్యాటర్!

యూట్యూబ్ లో కొన్ని ఫ్రేమ్స్ తోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ ను బిగ్ స్క్రీన్ పై కూడా చూడాలని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Update: 2025-01-10 03:54 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే విశేష స్పందన పొందుతూ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రంలోని ప్రతి అంశం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ చిత్రానికి ఎస్. థమన్ అందించిన సంగీతం ఇప్పటికే హైప్‌ క్రియేట్ చేసింది. ముఖ్యంగా “నానా హైరానా” పాట కూడా యూట్యూబ్ లో మంచి క్రేజ్ అందుకుంటోంది. కార్తీక్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన ఈ రొమాంటిక్ మెలోడీ, సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో వివేక్, హిందీలో కౌసర్ మునీర్ రాసిన ఈ పాట మూడు భాషల్లోనూ క్లిక్కయ్యింది.

యూట్యూబ్ లో కొన్ని ఫ్రేమ్స్ తోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ ను బిగ్ స్క్రీన్ పై కూడా చూడాలని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఆడియెన్స్ కు పాట కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ పాటను సినిమా మొదటి కాపీల్లో చేర్చలేకపోయారని సమాచారం.

ఈ పాటను ప్రత్యేకంగా ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేయడం విశేషం. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా చిత్రీకరించిన ఈ పాటలో రంగులు, లైటింగ్ విభిన్నంగా ఉండి అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. శంకర్ పర్యవేక్షణలో డీవోపీ తిరు ఈ పాటకు మరింత గ్రాండియర్‌గా చూపించారు. జనవరి 14 నుండి ఈ పాటను థియేటర్లలో చేరుస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో మరింత హైలైట్‌గా నిలుస్తుందని అర్ధమవుతుంది. న్యూజీలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఐదు రోజుల పాటు చిత్రీకరించిన ఈ పాట కోసం రష్యా నుంచి 100 మంది డ్యాన్సర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. శంకర్ పాట కోసం వాస్తవంగా ఏ స్థాయిలో శ్రమ పెట్టారో ఈ పాట చూస్తే అర్థమవుతుంది.

యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. పాట విడుదలైనప్పటి నుంచి మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంటూ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. జానపద టచ్‌తో కూడిన థమన్ ట్యూన్స్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కలయికలో ఈ పాట అందరినీ అలరించింది. ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags:    

Similar News