వీడియో : 'కల్కి' యాక్షన్‌ తెర వెనుక హీరో ఇతడే

హాంకాంగ్‌ మూలాలు ఉన్న యాండీ లాంగ్ జర్మనీ నుంచి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

Update: 2024-06-28 06:30 GMT

ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ దిశగా ఈ సినిమా దూసుకు పోతుంది. హిట్‌ టాక్ సొంతం చేసుకున్న కల్కి వసూళ్లు పలు రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫర్మ్‌ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి సినిమా చూసిన రివ్యూవర్స్ మరియు ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుకుండా ఉండలేక పోతున్నారు. లేటు వయసులో అమితాబచ్చన్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలు అందరిని అబ్బుర పరచుతున్నాయి. ముఖ్యంగా అమితాబ్‌, ప్రభాస్ కాంబో యాక్షన్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గ్రాఫిక్స్ తో కన్నుల విందు చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ యాక్షన్‌ సన్నివేశాల కొరియోగ్రపీ బాధ్యతను యాండీ లాంగ్ గ్యుఎఎన్‌ కు అప్పగించడం చాలా మంచి నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హాంకాంగ్‌ మూలాలు ఉన్న యాండీ లాంగ్ జర్మనీ నుంచి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని స్టంట్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. జాకీచాన్ తో కలిసి పలు సినిమాలకు వర్క్ చేశాడు. బాలీవుడ్‌ లో కూడా పలు సినిమాలకు యాక్షన్‌ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశాడు. మొదటి సారి టాలీవుడ్‌ సినిమాకు యాండీ లాంగ్‌ వర్క్ చేశాడు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అనుకున్నది అనుకున్నట్లుగా యాంటీ లాంగ్‌ స్క్రీన్‌ పై వచ్చే విధంగా స్టంట్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ వీడియో లో చెప్పుకొచ్చాడు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను యాండీ లాంగ్‌ డిజైన్ చేశాడంటూ అశ్విన్ అభినందించాడు.

కల్కి సినిమాలో అత్యంత కీలకమైన వీఎఫ్‌ఎక్స్ మరియు స్టంట్స్ రెండూ కూడా మంచి ఆధరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో సినిమా కు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వచ్చింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. కల్కి సినిమాతో యాండీ లాంగ్‌ ఇండియన్ స్క్రీన్‌ పై మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Full View
Tags:    

Similar News