బ్రేక‌ప్ గురించి అలా హింట్ ఇచ్చిందా!

మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ రిలేష‌న్ షిప్ కి బ్రేక్ ప‌డిందంటూ కొంత కాలంగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-18 05:18 GMT

మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ రిలేష‌న్ షిప్ కి బ్రేక్ ప‌డిందంటూ కొంత కాలంగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తార‌నుకుంటే? ఆ బంధం మ‌ధ్య‌లోనే వీగిపోవ‌డం ఏంటనే? అంశంపై బాలీవుడ్ లో చ‌ర్చ సాగుతోంది. అయితే విడిపోయిన‌ట్లు ఇరువురు నుంచి ఎలాంటి క‌న్ప‌ర్మేష‌న్ లేదు. బాలీవుడ్ లో మీడియాలో వ‌స్తోన్న క‌థ‌నాలు ఆధారంగానే ఈ చ‌ర్చ మొద‌లైంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మ‌లైకా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి తాను ఎలా ఉంటాను? అనే అంశాన్ని హైలైట్ చేసింది. `ఇంత‌వ‌ర‌కూ నేను ఏ విష‌యంలో ప‌శ్చాత్తాపం చెంద‌లేదు. త‌ప్పులు చేస్తూ కొత్త విష‌యాలు తెలుసుకున్నాను. వ్య‌క్తిగ‌తంగా, వృత్తి ప‌రంగా ఇలా ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే దానికి కార‌ణం నేను తీసుకున్న నిర్ణ‌యాల‌నే అని బ‌లంగా న‌మ్ముతాను` అంది. దీంతో బ్రేక‌ప్ వార్త‌ల‌కు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది.

ఇద్ద‌రి మ‌ధ్య ఈగో త‌లెత్త‌డంతోనే మ‌లైకా ఇలా త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి పంచుకుంద‌నే చ‌ర్చ సాగుతుంది. ఎప్పుడూ జంట‌గా క‌నిపించే అర్జున్ క‌పూర్- మ‌లైకా ఆరోరా? ఇప్పుడలా క‌నిపించడం లేదు. ఒక‌ప్పుడు ఏదైనా ఈవెంట్ కి వెళ్తే జంట‌గా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎవ‌రికి వారు సింగిల్ గా హాజ‌ర‌వుతున్నారు. దీంతో బ్రేక‌ప్ పుకార్లు మొద‌ల‌య్యాయి. తాజాగా మ‌లైకా వ్యాఖ్య‌ల‌తో అది నిజ‌మేనా? అన్న సందేహం బ‌ల ప‌డుతుంది.

అలాగే వృత్తిప‌రంగానూ మ‌లైకా మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది. ఇంత‌వ‌ర‌కూ అతిధి పాత్ర‌లు..ఐటం పాట‌ల్లోనే క‌నిపించా. కానీ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయాల‌ని ఉంద‌ని ఓపెన్ అయింది. ఇంత‌వ‌ర‌కూ ఈ విష‌యం ఎక్క‌డా చెప్ప‌లేదు. వాస్త‌వానికి మ‌లైకాకి కొంత కాలంగా సినిమా అవ‌కాశాలు రాలేదు. వ‌య‌సు ముద‌ర‌డంతో పాటు కొత్త భామ‌ల నుంచి పోటీ ఉండ‌టంతో మలైకాకి ఛాన్సులు రాలేద‌నే ప్ర‌చారం ఉంది.

Tags:    

Similar News