మలైకా ఇంట మాజీలిద్దరు పరామర్శ!
నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఒక్కసారిగా ప్రజలంతా ఉలిక్కి పడ్డారు. క్షణాల్లోనే నమ్మలేని నిజంగా మారి పోయింది. అనిల్ అరోరా ఆత్మహత్య ఏంటని? నెట్టింట నెటి జనులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
తాజాగా మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ కూడా వెళ్లారు. ఘటనా స్థలి నుంచి కొన్ని ఫోటోలు నెట్టింట వైలర్ అవుతున్నాయి. వాటిలో ఆర్బాజ్ ఖాన్, అర్జున్ కపూర్ తెల్ల బట్టలు ధరించి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఇరువురు మలైకాని ఓదార్చినట్లు తెలుస్తోంది. మలైకా అరోరా తొలుత అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ జోడీకి పిల్లలు కూడా ఉన్నారు.
కొన్నాళ్ల కాపురం అనంతరం కలతలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. కానీ స్నేహితులుగా మాత్రం కలుస్తున్నారు. కుమారుడు విదేశాల్లో చుదువుతున్నాడు. ఇండియా వచ్చినప్పుడు మలైకా-అర్బాజ్ ఖాన్ కలిసి తల్లిదండ్రుల ప్రేమని పంచుతారు. అలాగే అర్జున్ కపూర తోనూ మలైకా కొంత కాలం సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకే అపార్ట్ మెంట్ లో ఉండేవారు.
ఈ నేపథ్యంలో వివాహం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా? ప్రేమకి వయసుతో పనిలేదని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. కానీ కొంత కాలానికి ఆ బంధం బలహీన పడింది. మనస్పర్దలతో విడిపోయారు. ఇప్పుడు విధి ఇలా మాజీలిద్దరిన తన తండ్రి వద్దకు తీసుకొచ్చింది.