వీడియో: ఏ వేషంలో అయినా చంపుతుంది
ఇప్పుడు అలాంటి మరో ఫెస్టివల్ ఇది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో స్మోకింగ్ హాట్ దుస్తుల్లో హొయలు పోతూ మలైకా కనిపించింది.
బాలీవుడ్ స్టార్ -టెలివిజన్ పర్సనాలిటీ మలైకా అరోరా తన అద్భుతమైన లుక్స్ ఫ్యాషన్ సెన్స్ తో ఇప్పటికే యువతరం గుండెల్లో గూడు కట్టుకుంది. తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్నఈ బ్యూటీ దాపరికం లేని వ్యవహారం గురించి సంగతి తెలిసిందే. హ్యాపీలైఫ్ ని లీడ్ చేయడం అన్నిటికంటే ముఖ్యం! అనే సందేశం ఎప్పుడూ ఇస్తూనే ఉంది. అర్థం చేసుకునేవారికి అర్థం చేసుకున్నంత!
ఇక సోషల్ మీడియాల్లో మలైకాకు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిరంతర ఫోటోషూట్లు, వీడియో షూట్ల ఫెస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు. ఇప్పుడు అలాంటి మరో ఫెస్టివల్ ఇది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో స్మోకింగ్ హాట్ దుస్తుల్లో హొయలు పోతూ మలైకా కనిపించింది. ఈ కొత్త వేషంలో స్టన్నింగ్ ఫ్యాషన్ సెన్స్ కి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రేమ వ్యక్తమైంది. చాలామంది లవ్ ఈమోజీలతో మలైకాపై ప్రేమను కురిపించారు.
వైరల్ భయాని ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మలైకా అరోరా వీడియో క్లిప్‌ను చిత్రీకరించి అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. తళతళ మెరుపుల సిల్వర్ లెహంగాలో మలైకా స్టన్నింగ్ అవతార్ కి కళ్లన్నీ అటువైపే వాలిపోయాయి. ఎప్పటిలానే మలైకా సహజసిద్ధంగా మేకప్ లెస్ లుక్ తో కనిపించింది.ఈ ఫోటోలకు స్పందించిన ఒక అభిమాని ఇలా ప్రశ్నించారు. "కైసే తయారీ హోతీ హై షో కే లియే?" అని అడిగారు. దీనికి మలైకా అరోరా బదులిస్తూ, “సబ్ మ్యూజిక్ కే హిసాబ్ సే హోతా హై. కొరియోగ్రాఫర్లు ప్లగ్ ఇన్ చేసిన సంగీతం ప్రకారం నడుచుకోవాలి. లైటింగ్ .. డిజైనర్ లుక్ ప్రతిదీ దీనిని నిర్ణయిస్తుంది. అయితే ఎత్తు మడమలు ధరించి నడవడం కొన్నిసార్లు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు అలవాటు పడ్డాను'' అని మలైకా వివరణ ఇచ్చింది.
ఈ లుక్ కి స్పందించిన ఒక అభిమాని మలైకాపై ప్రశంసలు కురిపించారు. ఎంపిక చేసుకున్న ప్రతి వేషధారణలో చంపుతుంది అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ఆమె నిజంగా అందంగా ఉంది యార్ అని వ్యాఖ్యను జోడించారు. మలైకా అరోరా ఇటీవల దుబాయ్ విహారంలో ఉంది. తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఒక అందమైన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. అభిమానుల నుంచి దీనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
మలైకా ప్రియుడు అర్జున్ కపూర్ కోరిక అందరి దృష్టిని ఆకర్షించింది. అతడు తన సోషల్ హ్యాండిల్లో తన 'బేబీ'కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు ఒక అందమైన ఫోటోని కూడా షేర్ చేసాడు. దీనిపై మలైకా అరోరా కూడా ప్రతిస్పందించింది. దీంతో బ్రేకప్ పుకార్లను కొట్టివేసినట్టయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ రూమర్ల గురించి ప్రస్తావించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మలైకా మాట్లాడుతూ- ''నేను ఇప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి చర్చించదలచుకోలేదు. మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేనేమీ ఇంకా స్పష్టం చేయనవసరం లేదు. ఎందుకంటే చెప్పవలసినది ఇప్పటికే చెప్పేశాం'' అని వ్యాఖ్యానించారు. మలైకా ఇటీవల సినిమాల్లో కనిపించడం లేదు. కానీ టీవీ రియాలిటీ షోలతో నిరంతరం బిజీగా ఉంది. ముఖ్యంగా డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా భారీగా ఆర్జిస్తోంది. సోసల్ మీడియాల్లో యాడ్ పోస్టుల ఆదాయం పుష్కలంగా ఉంది. త్వరలోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనుంది.