పిక్‌టాక్ : పట్టు చీరలో పుత్తడి బొమ్మ
ఆలస్యంగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నా ఒక మంచి సాలిడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్నా మాళవిక మోహనన్ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అందాల ఆరబోత ఫోటోలతో పాటు, డబ్బింగ్ సినిమాల కారణంగా ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది అనడంలో సందేహం లేదు. తెలుగులో ఈ అమ్మడు సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోతో రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆలస్యంగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నా ఒక మంచి సాలిడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. దాదాపుగా 4.4 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మాళవిక మోహనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ అంతకు మించి అన్నట్లు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి తన స్కిన్ షో చేయకుండా సాంప్రదాయబద్దమైన ఫోటోలతో ఆకట్టుకుంది. ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ పట్టు చీరలో పుత్తడి బొమ్మ మాదిరిగా కనిపించి ఆకట్టుకుంది. ఈసారి చాలా స్పెషల్ అన్నట్లు ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.
తెలుగులో ఈ అమ్మడు రాజాసాబ్ సినిమాలో నటించడం కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రభాస్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించని మాళవిక మోహనన్ ఈమధ్య కాలంలో తాను ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మారుతి దర్శకత్వంలో తాను చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో వైరల్ అయ్యింది.
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్ మాత్రమే కాకుండా నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు సైతం నటిస్తున్నారు. అయినా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ సినిమాలో నయనతార సైతం కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. నయనతార ఐటెం సాంగ్‌లో కనిపించబోతుందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఏది ఏమైనా రాజాసాబ్ హీరోయిన్ అనగానే ఎక్కువగా మాళవిక మోహనన్ పేరు వినిపిస్తుంది. కనుక రాజాసాబ్ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రాజాసాబ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే మాళవిక మోహన్ కి మరిన్ని తెలుగు సినిమాలతో పాటు హిందీలోనూ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.