హైదరాబాదీ 'ప్రేమలు'.. బడ్జెట్‌ 5 కోట్లు, కలెక్షన్స్‌ 30 కోట్లు

చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆటతోనే మంచి స్పందన దక్కింది.

Update: 2024-02-17 07:28 GMT

ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్‌ సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకుని పదుల కోట్ల వసూళ్లు నమోదు చేయడం, వంద కోట్ల వసూళ్లు దక్కించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మలయాళ మూవీ 'ప్రేమలు' కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌ తో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పుడే రూ.30 కోట్ల గ్రాస్‌ వసూళ్లు నమోదు చేసింది.

ఈ సినిమా కథ హైదరాబాద్‌ నేపథ్యంలో సాగడం విశేషం. తెలుగు సినిమాలు ఎక్కువగా కేరళ, ముంబై బ్యాక్ డ్రాప్ తో సాగడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మలయాళ ప్రేమలు సినిమా మాత్రం మన హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌ లో సాగడం ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు.

చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆటతోనే మంచి స్పందన దక్కింది. మొదటి రోజు నామమాత్రపు వసూళ్లు నమోదు అయినా తర్వాత రోజు నుంచి మౌత్ టాక్ తో భారీగా వసూళ్లు నమోదు అవ్వడం మొదలు అయ్యింది.

ఇప్పటి వరకు ఏకంగా రూ.30 కోట్లకు మించిన వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా లాంగ్‌ రన్‌ లో రూ.60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఆశ్చర్యం లేదు అన్నట్లుగా మలయాళ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

హిట్‌ సినిమాల రీమేక్ లేదా డబ్బింగ్‌ రైట్స్ కోసం పోటీ పడే మన నిర్మాతలు మరియు బయ్యర్లు ఇప్పటికే ప్రేమలు సినిమా డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News