ప్రేమలు బ్యూటీ ప్లానింగ్ అదుర్స్..!
సో రాబోయే రోజుల్లో సౌత్ లో మమితా బైజు అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఐతే ప్రేమలు తెలుగులో కూడా హిట్ అయినా అమ్మడికి తెలుగు నుంచి మాత్రం ఇంకా ఏ సినిమా కన్ఫర్మ్ అవ్వలేదు.
కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే హీరోలకైనా హీరోయిన్స్ కి అయినా కెరీర్ టర్న్ చేసే సినిమా మాత్రం ఒకటే అవుతుంది. సరైన టైం లో సరిన హిట్ అందుకున్న తర్వాత అప్పటి వరకు కెరీర్ ఒకళా ఉంటే ఆ తర్వాత నుంచి మరోళా ఉంటుంది. దాన్ని గుర్తించి అవకాశాలను అందుకుంటే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. సౌత్ స్టార్ గా ఎదిగిన ప్రతి కథానాయిక కెరీర్ లో ఇలాంటి ఒక సినిమా ఉంటుంది. మళయాల భామ మమితా బైజు కెరీర్ లో అలాంటి సినిమానే ప్రేమం.
అమ్మడు కెరీర్ మొదలు పెట్టి 7 ఏళ్లు అవుతున్నా కూడా మంచి హిట్ కోసం చూస్తున్న అమ్మడు ప్రేమలు సక్సెస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రేమలు సినిమలో ఆమె నటనకు సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఫిదా అయ్యారు. క్యూట్ లుక్స్ లో మమితా బైజు యువ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఐతే ప్రేమలు హిట్ పడిన తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా కూడా మమితా ఆచి తూచి అడుగులేస్తుంది.
ప్రేమం సినిమా మలయాళంలో రిలీజైనా ఆ సినిమా సక్సెస్ తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించింది. అమ్మడు కోలీవుడ్ లో ఇప్పటికే రెబల్ అనే సినిమా చేయగా ఇప్పుడు ఏకంగా 3 సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లో దళపతి విజయ్ చివరి సినిమాలో మమితా నటిస్తుంది. ఆ సినిమాతో పాటుగా ప్రదీప్ రంగనాథ్ తో కలిసి రెండు సినిమాల్లో నటిస్తుంది. తనకు వచ్చిన ఈ పాపులారిటీ ప్రకారం ఆఫర్ వచ్చిన ప్రతి సినిమా చేయకుండా కేవలం తనకు నచ్చిన కథలనే చేస్తూ వస్తుంది.
అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా మమితా తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో సౌత్ లో మమితా బైజు అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఐతే ప్రేమలు తెలుగులో కూడా హిట్ అయినా అమ్మడికి తెలుగు నుంచి మాత్రం ఇంకా ఏ సినిమా కన్ఫర్మ్ అవ్వలేదు. తెలుగు ఆడియన్స్ కూడా మమితా టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమా ఏది అవుతుందా అని తెలుగు సినీ లవర్స్ ఆసక్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సినిమాలో మమితా నటిస్తుందని వార్తలు రాగా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది.